rains for two days
-
Telangana: మరో రెండ్రోజులు వానలే..
సాక్షి, హైదరాబాద్: కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాతీరం చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. రానున్న ఆరు గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. జైసాల్మయిర్, కోట, గుణ, మాండ్ల, అంతర్గత ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉపరితల ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కొనసాగుతున్నట్టు వివరించింది.రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. ఆదివారం రాష్ట్రంలో సగటున 3.32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 8.81, జగిత్యాల జిల్లాలో 7.01, నిర్మల్ జిల్లాలో 6.92, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6.83 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్లగొండ, గద్వాల జిల్లాలు మినహాయిస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 23.39 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఆదివారం నాటికి 36.43 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కంటే 33శాతం అధికంగా వానలు నమోదయ్యాయి. -
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తులో విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. సోమవారం ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంలోనే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అదేరోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునేందుకు అవకాశం ఉంది. చదవండి: వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. ఏపీ సర్కార్ గుడ్న్యూస్ -
మరో రెండు రోజులు ఇంతే!
-
మరో రెండు రోజులు ఇంతే!
ఒకవైపు అల్పపీడన ద్రోణి, దానికితోడు ఉపరితల ద్రోణి కూడా ఉండటంతో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా వాతావారణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తర కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ వరకు కూడా ఈ ద్రోణులు వ్యాపించి ఉన్నాయి. వీటి ప్రభావంతోనే వర్షాలు పడుతున్నాయి. కోస్తా ప్రాంతంలో కూడా ఒకరోజు తర్వాత వానలు పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వేసవి ప్రారంభానికి ముందు వచ్చే ప్రీ మాన్సూన్గా వీటిని పేర్కొంటున్నారు. అయితే.. ఇప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల తర్వాతి కాలంలో ఎండలు బాగా ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. సోమవారం నాడు వర్షాలు తెలంగాణ, రాయలసీమల్లో ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల పంటలు నష్టపోయే ప్రమాదం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.