
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం సముద్రమట్టానికి 3.6 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇది అల్పపీడనంగా మారిన తర్వాత పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక వైపుగా పయనిస్తూ..14వ తేదీ రాత్రి లేదా 15వ తేదీ ఉదయం తీరం దాటనుందని తెలిపారు. దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు, రేపు మోస్తరు నుంచి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.