యువతిపై కళాశాల ఎండీ రాసలీలలు | College MD Molestation On Woman Employee In Tamil Nadu | Sakshi
Sakshi News home page

కోవై యువతిపై కళాశాల ఎండీ రాసలీలలు

Published Fri, Sep 21 2018 10:24 AM | Last Updated on Fri, Sep 21 2018 10:24 AM

College MD Molestation On Woman Employee In Tamil Nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: కోయంబత్తూరు ఎంఎన్‌ఎస్‌ కళాశాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ గత రెండేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నట్టు అందులో పనిచేసే ఓ యువతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోవై ఎంఎన్‌ఎస్‌ కళాశాల కళాశాల ఎండీ సుబ్రమణ్యన్‌ (64) అదే కళాశాలలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిసింది. ఎండీకి తెలియకుండా సదరు యువతే ఎండీ చాంబర్‌లో కెమెరాలను అమర్చి ఆధారాలతో సహా పోలీసులకు పట్టించింది.

ఎండీ చాంబర్‌లో ఫిర్యాదు చేసిన విద్యార్థినితో ఎండీ అభ్యంతరకర రీతిలో, అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఆ యువతి సహ ఉద్యోగులు ఎండీ కుమారుడు, నళిని వద్ద తెలపగా, వారు విదేశాల్లో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం పెద్ద తప్పేమి కాదని సమర్థించడమే కాకుండా, మీ పనులు మీరు చూసుకోండి లేకుంటే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కెమెరాలు పెట్టి ఎండీ రాసలీలను బహిర్గతం చేసిందుకు ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించడమే కాకుండా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ యువతి గురువారం తుడియలూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement