
నిందితుడు జోసఫ్
పంజగుట్ట: ఆర్టీసీ బస్సులో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి ప్రయాణికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాణిగంజ్ డిపోకు చెందిన 49ఎం బస్సులో బుధవారం ఉదయం ఓ మహిళ ప్యాట్నీ నుంచి పంజగుట్టకు వస్తుండగా ఆమె పక్కనే కూర్చున్న తాడ్‌బండ్‌కు చెందిన జోసఫ్ (34) అనే యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు తోటి ప్రయాణికులతో కలిసి జోసఫ్‌ను చితకబాది పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment