
చందంపేట నల్గొండ : ఆస్తుల కోసం మారుమూల గ్రామాల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. రెండు ఎకరాల భూమి కోసం సొంత తమ్ముడు, తమ్ముడి కుమారుడు, తమ్ముడి భార్యను చంపేందుకు వెనుకాడ లేదు. వివరాల్లోకెళ్తే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చందంపేట మండలం చిత్రియాల గ్రామపంచాయతీ పరిధిలో చో టు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రమావత్ చందు, గోప్య అన్నదమ్ములు.
వీరికి తల్లిదండ్రుల ఆస్తి 25 ఎకరాలు ఉంది. తండ్రి మృతిచెందడంతో ఇరువురికి 11.5 ఎకరాల చొప్పున గతంలోనే పంచారు. రెండు ఎకరాల భూమిని తల్లి మోతి పేరున ఆమె బాగోగుల కోసం తనవద్దే ఉంచుకుంది. ఈ రెండు ఎకరాల భూమిని గోప్యకుమారుడు దేశు ఎవరికి చెప్పకుండా తన సొంతం చేసుకుని రెవెన్యూ అధికారులతో కలిసి పత్రాలు సృష్టించాడు. ఇది తెలుసుకున్న చందు కుమారుడు రమావత్ బాలు రెవెన్యూ అధికారులను వివరణ కోరగా దేశుపై భూమి రెండు ఎకరాల భూమి ఉందని చెప్పడంతో పెద్ద మనుషులను ఆశ్రయించాడు.
పలుమార్లు ఇదే విషయంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. గతంలో కూడా కేసులు అయినప్పటికీ ఈనెల 7వ తేదీన చందంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో చందు, రమావత్ బాలులు ఫిర్యాదు చేశారు. ఈనెల 14న ఇరువర్గాలు రావాల్సిందిగా ఎస్‌ఐ కబురు పెట్టారు. 8వ తేదీ సాయంత్రం సమయంలో చందు, భార్య గ్వాలి, కుమారుడు బాలు ఇంట్లో ఉన్న సమయంలో గోప్య, దేశు, తుల్చా, లక్ష్మాలు దాడి చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
మేమే చేశామంటూ ..
కాగా చందు కుటుంబంపై మేమే దాడి చేశామంటూ వారి కుటుంబం చనిపోయిందంటూ గోప్య, దేశు, తుల్చా, లక్ష్మాలు చందంపేట మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు పుకార్లు వస్తున్నాయి. గ్రామంలో దాడితో భయాందోళన వాతావరణం నెలకొంది. గతంలో కూడా వారి కుటుంబంపై దాడి జరిగిందని చిత్రియాల గ్రామస్తులు పేర్కొంటన్నారు. ఇదే విషయమై ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ను వివరణ కోరగా తాము రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బిజీగా ఉన్నామని, ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికే విచారణ కూడా చేపట్టామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment