
గుంటూరు రూరల్: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆపై ఖాకీ దుస్తులు వేసుకుని వచ్చి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన బుధవారం మండలంలోని తోకావారిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ బాలమురళీకృష్ణ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపలకలూరు గ్రామానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి పక్క గ్రామమైన తోకావారిపాలేనికి చెందిన నిర్మల అనే మహిళ పట్ల మంగళవారం అర్ధరాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయటంతో పరారయ్యాడు. ఈ సమయంలో తన ఫోన్ ఆమె ఇంట్లో పడిపోయింది. బుధవారం ఉదయం సాంబశివరావు ఖాకీ దుస్తులు ధరించి మహిళ ఇంటికి వచ్చాడు. తాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు వ్యక్తినని మహిళను బెదిరించాడు. దీంతో స్థానికులు వచ్చి అతనిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహ శుద్ధి చేశారు. అనంతరం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment