
ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చైతన్య
పార్వతీపురం: సినిమా హాల్‌లో మహిళల మరుగుదొడ్డిలో దూరి మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ స్వీపర్ సంఘటన మంగళవారం పార్వతీపురం పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ ఎం.రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం సీతానగరం మండలం సీతానగరం గ్రామానికి చెందిన తోట చైతన్య తన భార్య ఇంద్రలీల(ఇందు)తో కలసి పట్టణంలోని సౌందర్య థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు.
చిత్రం విశ్రాంతి సమయంలో మూత్రశాలలోకి వెళ్లిన ఇందును అనుసరించిన థియేటర్ స్వీపర్ ఈశ్వరరావు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ విషయాన్ని ఇందు తన భర్త చైతన్యకు తెలియజేయగా ఆయన వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఈశ్వరరావును కొట్టాడు. దీంతో ఈశ్వరరావు వారి సహచర సిబ్బందిని పిలిచి మూకుమ్మడిగా చైతన్యపై దాడి చేశారు. ఈ సంఘటనలో చైతన్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతనిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ సంఘటనపై పట్టణ ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment