rtc depo
-
డిపోలో బస్సు ఢీకొని డ్రైవర్ మృతి
హకీంపేట్: రంగారెడ్డి జిల్లా హకీంపేటలోని ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని డ్రైవర్ దుర్మరణం చెందాడు. డిపోలోని మెకానిక్ బస్సును టెస్ట్ డ్రైవ్ కోసం వెనకకు తీస్తుండగా అక్కడే వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న డ్రైవర్ ఫాకిరా నాయక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బొమ్మల రామారం మండలం సోలిపేట రాముని తండా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్తులు డిపో ముందు ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా బస్సును నడిపి ఫాకిరా నాయక్ మృతికి కారణమైన ఆసిస్టెంట్ మెకానిక్ వెంకటేష్ పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు ప్రమాదానికి కారణమైన వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
సత్తుపల్లి పట్టణంలో ఉద్రిక్తత
సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిని జిల్లా కేంద్రం చేయాలంటూ పట్టణంలో నేటి నుంచి చేపడుతున్న 48 గంటల బంద్ ఉద్రిక్తంగా మారింది. బుధవారం తెల్లవారుజామునే ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ నాయకులు బైఠాయించడంతో.. డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జేఏసీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం డిపో ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'అన్ని డిపోల నుంచి అమరావతికి బస్సులు'
కోవెలకుంట్ల (కడప): కొత్త రాజధాని అమరావతికి రానున్న రోజుల్లో అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.రామారావు తెలిపారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రెండు నెలల్లో కడప ఆర్టీసీ రీజియన్‌కు 40 కొత్త బస్సులు రానున్నట్లు తెలిపారు. కర్నూలు, అనంతపురం రీజియన్లకు 60 కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే అనంతపురం రీజియన్ రూ.23 కోట్లు, కర్నూలు రీజియన్ రూ.19 కోట్లు, కడప రీజియన్ రూ.15 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షితుల్ని చేసేందుకు కర్నూలు జిల్లాలో 70, కడప జిల్లాలో 45, అనంతపురం జిల్లాలో 60 ప్రయాణికుల కూడళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ నరసింహులు, ఈడీ పర్సనల్ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా
-
పొక్లయిన్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్: ఆగిన పొక్లయిన్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యా యి. పోలీసుల కథనం ప్రకారం రాజమండ్రి ఆర్టీసీ డిపోకు చెందిన నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్ 33 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి బయల్దేరింది. జాతీయ రహదారిని ఆనుకున్న కొప్పాక గ్రామ సమీపంలోని ఏలేరు కాలువలో పూడిక తీసేందుకు ట్రాలర్‌పై పొక్లయిన్‌ను సోమవారం రాత్రి తీసుకొచ్చి విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారి రోడ్డు పక్కన నిలిపారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్ ఆగిన పొక్లయిన్ బెల్టును ఢీకొంది. దీంతో బస్సుకు ఎడమ వైపు సీట్లను ఆనుకున్న రేకు పూర్తిగా ఊడిపోయింది. ఆ వైపు కూర్చున్న విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన పి.శ్రీదేవి (40), అక్కయ్యపాలెంకు చెందిన ఎ.సత్యనారాయణ (42), మచిలీపట్నానికి చెందిన కె.రమేష్‌బాబు (47) తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఉదయశ్రీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గణేష్, అసిస్టెంట్ మెకానిక్ మోహన్‌రావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన ప్రత్యేక వాహనంలో విశాఖలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారకుడైన బస్సు డ్రయివర్ సిహెచ్.నారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.