కోవెలకుంట్ల (కడప): కొత్త రాజధాని అమరావతికి రానున్న రోజుల్లో అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.రామారావు తెలిపారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రెండు నెలల్లో కడప ఆర్టీసీ రీజియన్‌కు 40 కొత్త బస్సులు రానున్నట్లు తెలిపారు. కర్నూలు, అనంతపురం రీజియన్లకు 60 కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు.
గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే అనంతపురం రీజియన్ రూ.23 కోట్లు, కర్నూలు రీజియన్ రూ.19 కోట్లు, కడప రీజియన్ రూ.15 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షితుల్ని చేసేందుకు కర్నూలు జిల్లాలో 70, కడప జిల్లాలో 45, అనంతపురం జిల్లాలో 60 ప్రయాణికుల కూడళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ నరసింహులు, ఈడీ పర్సనల్ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'అన్ని డిపోల నుంచి అమరావతికి బస్సులు'
Published Thu, Sep 24 2015 7:45 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
Advertisement
Advertisement