డ్రైవర్‌ సమయస్పూర్తి: ప్రాణాలు పోతున్నా.. | Bus Driver Saves Passengers Life While Having Heart Attack In Krishna District | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ సమయస్పూర్తి: ప్రాణాలు పోతున్నా..

Published Sun, Nov 29 2020 8:33 PM | Last Updated on Sun, Nov 29 2020 9:00 PM

Bus Driver Saves Passengers Life While Having Heart Attack In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : గుండెపోటు కారణంగా ప్రాణాలు పోతున్నా సమయస్పూర్తిగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు ఓ బస్సు డ్రైవర్‌. ఈ సంఘటన ఆదివారం జిల్లాలోని జి. కొండూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గంపలగూడెం మండలం పెనుగోలుకు చెందిన కృష్ణారావు అనే డ్రైవర్‌ నడుపుతున్న ఆర్టీసి బస్సు తిరువూరు నుంచి విజయవాడ బయలుదేరింది. జి. కొండూరు మండలం లక్కిరెడ్డి సమీపంలోకి రాగానే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ( పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..)

అయితే నొప్పి ప్రాణాలు తీస్తున్నప్పటికి స్టీరింగ్‌ను వదలక, సమయస్పూర్తితో బస్సును పక్కకు నిలిపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే డ్రైవర్‌ కృష్ణారావు బస్సులోనే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని పోలీసులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement