న్యూఢిల్లీ: హర్యానా రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ డ్రైవర్ కులాసాగా హుక్కా తాగుతూ.. పక్కాగా దొరికిపోయాడు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో ఢిల్లీ ప్రభుత్వం హర్యానా రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ డ్రైవర్ ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.
ఆ వివరాలిలా... హర్యానా రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సు (నెంబర్ హెచ్ఆర్ డబ్ల్యూ 9038) ఢిల్లీకి బయలుదేరింది. ఆ బస్సు డ్రైవర్ ఉల్లాసంగా హుక్కా పీలుస్తూ బస్సు నడిపాడు. కారులో వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఒకరు డ్రైవర్ నిర్వాకాన్ని వీడియో తీసి ఢిల్లీ చేరుకున్నాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా, అదే బస్సులోని టీవీలో పటాకా బీడీ అనుబంధంగా ఉన్న పటాకా టీ ప్రకటన కూడా ప్రసారమయింది. ఈ రెండు ఘటనలు పొగతాగేలా చిన్నారులు, మహిళలను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ ఢిల్లీ అధికారులు ఫిర్యాదు చేశారు. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన ఆ డ్రైవర్‌పైనా, పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రకటనలు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment