
తాగి బస్సు నడిపిన డ్రైవర్ చంద్రు (ఖాకీ దుస్తుల వ్యక్తి)
తప్పతాగి బస్సు నడుపుతూ నిలిపి ఉన్న కారును ఢీకొని ఇదేమని ప్రశ్నించిన వారిని బండబూతులు తిట్టిన డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని...
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును ఢీకొన్న వైనం
దొడ్డబళ్లాపురం : తప్పతాగి బస్సు నడుపుతూ నిలిపి ఉన్న కారును ఢీకొని ఇదేమని ప్రశ్నించిన వారిని బండబూతులు తిట్టిన డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన నెలమంగల పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. బెంగళూరు నుండి నెలమంగల వస్తున్న ఎస్‌ఎల్‌ఎన్ ప్రైవేటు బస్సు కాలనీ బస్టాండు వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును ఢీకొంది.
దీంతో బస్ డ్రైవర్‌ను బస్సు నుండి కిందకు దించిన స్థానికులు డ్రైవర్ చంద్రు తప్పతాగినట్టు గుర్తించారు. ఇదేమని ప్రశ్నించగా డ్రైవర్ చంద్రు బండబూతులు తిడుతూ వీరంగం చేశారు. ఒకరిపై చేయి చేసుకున్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు డ్రైవరర్ చంద్రుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.