
స్టీరింగ్ ముందు లోకేష్
బనశంకరి: మద్యం సేవించి వాహనాన్ని నడిపి ప్రయాణికులను హడలెత్తించిన బీఎంటీసీ డ్రైవర్ ఉదంతం బుధవారం బెంగళూరులో కలకలం సృష్టించింది. శాంతినగర్ బస్ డిపోకు చెందినడ్రైవర్ లోకేష్ బుధవారం ఉదయం బస్సులో ఎక్కించుకొని మెజిస్టిక్ నుంచి తలఘట్టపురకు బయలుదేరాడు. అప్పటికే మద్యం సేవించిన లోకేశ్..సారక్కి సిగ్నల్ వద్దకు చేరుకోగానే ముందున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టాడు. కోపోద్రిక్తుడైన ఇన్నోవా వాహనదారుడు బస్సులోకి ఎక్కి డ్రైవర్‌ను ప్రశ్నించగా అతను మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. ఘటన గురించి తెలుసుకున్న బీఎంటీసీ అధ్యక్షుడు నాగరాజ యాదవ్ మాట్లాడుతూ.. ఇది క్షమించారాని నేరమని, మద్యం తాగి బస్సు నడిపిన లోకేశ్‌ను క్షమించే ప్రసక్తే లేదన్నారు.