కడప: ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లాలోని పుల్లంపేట మండలం అప్పరాజుపేట సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.