పూజా దేవీ
జమ్మూకశ్మీర్ : ఓ మహిళా బస్ డ్రైవర్‌కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట్ చక్కర్లు కొడుతోంది. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ షేర్ చేసిన ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ విశేషం ఏమిటంటే జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాకు చెందిన పూజా దేవీ అనే మహిళ మొదటి మహిళా బస్ డ్రైవర్ కావడం. ‘‘జమ్మూకశ్మీర్ మొదటి మహిళా బస్ డ్రైవర్ పూజా దేవి. నువ్వు కధువా జిల్లాకు చెందినదానివైనందుకు గర్వంగా ఉంది’’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ( వెలుగులోకి వేల ఏళ్ల నాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు )
డ్రైవర్ సీట్లో కూర్చున్న ఆమె విక్టరీ సంకేతం చూపిస్తున్న ఫొటో డిసెంబర్ 25న షేర్ అవ్వగా ఇప్పటి వరకు 4,500 లైకులు సొంతం చేసుకుంది. దీనిపై స‍్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఓ గొప్ప ప్రారంభం.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు... ఓ మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, దేశాన్ని కూడా పాలించగలదు... ఇతర మహిళలకు మీరు స్పూర్తిగా నిలుస్తున్నారు.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (భార్యకు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్)
Comments
Please login to add a commentAdd a comment