బస్సు తగిలిందని తెలంగాణ ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌పై కానిస్టేబుల్‌ ఉగ్రరూపం | Police Constable Brutally Beats TSRTC Bus Driver At Mahabubnagar Bus Stand | Sakshi
Sakshi News home page

TSRTC: బస్సు తగిలిందని తెలంగాణ ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌పై కానిస్టేబుల్‌ ఉగ్రరూపం

Published Mon, Nov 15 2021 7:40 PM | Last Updated on Mon, Nov 15 2021 8:13 PM

Police Constable Brutally Beats TSRTC Bus Driver At Mahabubnagar Bus Stand - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మహబూబ్‌నగర్‌ క్రైం: బస్టాండ్‌లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్‌కు బస్సు తగిలిందని సదరు కానిస్టేబుల్‌ ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో టూటౌన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ డ్యూటీ చేస్తున్న క్రమంలో బస్టాండ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌ నుంచి రాయిచూర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బస్టాండ్‌లో లోపలికి వస్తున్న క్రమంలో కానిస్టేబుల్‌ నడుచుకుంటూ వస్తున్న క్రమంలో బస్సు తగిలింది.

దీంతో బస్సు డ్రైవర్‌ కిందకు దిగి కానిస్టేబుల్‌ను లేపడానికి ప్రయత్నించే క్రమంలో ఒక్కసారిగా అతనిపై దాడి చేసి ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో పాటు తీవ్రంగా కొట్టాడు. దీంతో ప్రయాణికులు, ఇతర ఆర్టీసీ సిబ్బంది కానిస్టేబుల్‌ను పట్టుకొని గదిలో వేశారు. అనంతరం టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కానిస్టేబుల్‌తో పాటు డ్రైవర్, కండక్టర్‌లను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని టూటౌన్‌ ఎస్‌ఐ సైదయ్య తెలిపారు.    
(చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్‌ లీటర్‌ రూ.95, కర్ణాటకలో రూ. 85)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement