
మెల్‌బోర్న్: సూరజ్ రణ్‌దీవ్ గుర్తున్నాడా... శ్రీలంక తరఫున ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టి20 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్‌స్పిన్నర్. అతని ప్రదర్శనకంటే ఒకసారి మన సెహ్వాగ్ సెంచరీ పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా ‘నోబాల్’ వేసిన బౌలర్‌గానే భారత అభిమానులకు బాగా తెలుసు. రెండేళ్ల క్రితం స్వదేశంలో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అతను ఉపాధిని వెతుక్కుంటూ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. మెల్‌బోర్న్‌లో స్థానిక క్లబ్‌లలో క్రికెట్ ఆడుతున్నా... సంపాదన కోసం అతను మరో ఉద్యోగాన్ని చూసుకోక తప్పలేదు.
దాంతో రణ్‌దీవ్ అక్కడ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఫ్రాన్స్ కంపెనీ ‘ట్రాన్స్‌డెవ్’ నిర్వహణలో నడుస్తున్న ప్రజా రవాణా బస్సులో అతను డ్రైవర్‌గా ఉన్నాడు. కొన్ని చిన్నస్థాయి క్రికెట్ దేశాల్లో ఆదాయం కోసం ఇతర పనులు చేయడం సాధారణమే అయినా... ఒక ఆసియా జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ చిరుద్యోగం చేయడం మాత్రం పెద్దగా కనిపించదు. 2011 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రణ్‌దీవ్ 8 మ్యాచ్‌లు ఆడి ఆకట్టుకునే ప్రదర్శనే (7.68 ఎకానమీ) కనబర్చాడు. లంక తరఫున రణ్‌దీవ్ 2016లో చివరి మ్యాచ్ ఆడాడు. అతనితోపాటు మరో ఇద్దరు క్రికెటర్లు చింతక జయసింఘే (శ్రీలంక–5 టి20లు), వాడింగ్టన్ వయెంగా (జింబాబ్వే–1 టెస్టు, 3 వన్డేలు) కూడా ఇదే కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఇక్కడ చదవండి: ‘అస్సలు నమ్మలేకపోతున్నా.. గర్వపడేలా చేశాడు’
Comments
Please login to add a commentAdd a comment