తొక్క తీస్తూ బస్సు నడిపాడు..
రోజుకో ఆపిల్ తిను.. డాక్టర్‌కు దూరంగా ఉండు అనే విషయాన్ని వంటబట్టించుకున్నాడో..
రోజుకో ఆపిల్ తిను.. డాక్టర్‌కు దూరంగా ఉండు అనే విషయాన్ని వంటబట్టించుకున్నాడో ఏమో కానీ.. పొరుగు దేశం చైనా డ్రైవర్.. ఆపిల్ తొక్క తీస్తూ ఏకంగా ప్యాసింజర్ బస్సును డ్రైవ్ చేశాడు. ఇది కాస్త బస్సులోని సీసీ కెమెరాలో రికార్డు కావడంతో డాక్టర్‌కు దూరంగా ఉండటం ఏమో కానీ మళ్లీ ఏ ప్యాసింజర్ బస్సు నడపకుండా అయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ ఘటన చైనాలోని జియాంగ్స్ పరిధిలోని తైజుహులో ఈ నెల 11న జరిగింది. చైనా అధికారులు ఈ డ్రైవర్‌పై ఎలాంటి ప్యాసింజర్ వాహనం నడపకుండా నిషేదం విధించారు.