ఆమె నక్సల్స్‌తో హడలెత్తిపోయే ఊరు నుంచి మొదలైంది ఆమె బాల్యం. ఆమె చదువు కటిక దారిద్యం, నక్సల్స్ బెడద మధ్య భయం భయంగా సాగింది. అయినా వెరవక ఉన్నత చదువులు చదవడమే గాక ఏకంగా లండన్‌లో ఉద్యోగం కొట్టి.. ఔరా! అనిపించుకుంది ఓ బస్సు డ్రైవర్ కూతురు. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె స్ఫూర్తివంతమైన విజయగాథ ఎలా సాగిందంటే..
చత్తీస్‌గఢ్ జిల్లాలోని సుక్మా జిల్లాలో నక్సల్స్ బాధిత దోర్నపాల్‌కి చెందిన బస్సు డ్రైవర్ కూతురు రియా ఫిలిప్. ఆ ప్రాంతం అంతా తీవ్రవాదుల భయం ఎక్కువ. ఎప్పుడూ పోలీసుల కర్ఫ్యూల, తుపాకీ మోతలు, ఆర్తనాదాలతో అట్టుడుకిపోతుండేది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చించి రియా. అయినప్పటికీ బతుకు ప్రయాణం సాఫీగా సాగాలంటే ఒక్కటే ఆయుధం చదువు అని స్ట్రాంగ్ డిసైడ్ అయ్యింది. ఎన్ని భయాలు ముందున్నా వెరవక చదువుపై దృష్టి పెట్టింది. ఆమె తల్లి షోలీ ఫిలిప్ ప్రైవేటు స్కూల్ టీచర్ కాగా, తండ్రి రితేష్ ఫిలిప్ అదే స్కూల్‌లో బస్సు డ్రైవర్.
మధ్య తరగతి కుటంబం అయినా తమ పిల్లలకు మంచి చదువు అందించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. పిల్లల చదువు కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా ఆ జంట వెనుకాడలేదు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివారు. అయితే ఆ కుటుంబ నక్సల్స్ భయంతో దుబ్బతోట గ్రామం నుంచి దోర్నపాల్‌కి తరలి వెళ్లిపోవడంతో తీవ్రమైన కష్టాల్లోకి కూరుకుపోయారు. అయినా పిల్లల చదువులకు మాత్రం ఎలాంటి ఆటంకం రానివ్వలేదు. అలాగే రియా కూడా వారి ఆశను ఒమ్ము కానియ్యకుండా బాగా చదవడమే గాక ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం సంపాదించింది.
అక్కడ రెండేళ్ల పాటు సేవలందించింది. అలా సాగిన ఆమె ప్రయాణం యూకేలో ఉద్యోగం సంపాదించే స్థాయికి చేరుకుంది. చివరికి రియాకు లండన్‌లో మంచి ఉద్యోగం ఆఫర్ వచ్చింది. ఐతే ఆమె లండన్ వెళ్లేందుకు తల్లిదండ్రులు ఇంటిని తాకట్టుపెట్టి మరీ రూ 3 లక్షలు సమకూర్చారు. ఏమైతేనేం ఎన్నో కష్టాలను ఈదుకుంటూ..ఆమె లండన్‌లో ఏకంగా 21 లక్షల వార్షిక ప్యాకేజితో మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. పైగా ఆమె తల్లిదండ్రులు కూతురు నెలవారి జీతం రూ లక్ష ఎనభై వేలని గర్వంగా చెప్పుకునేలా చేసింది.
రియా విజయగాధని చూసి ఆమె బంధువులు కుటుంబ సభ్యులకి గర్వాన్ని కలిగించడమే గాక ఆమె జిల్లాలోని విద్యా వ్యవస్థ మెరుగపడేందుకు ప్రేరణ ఇవ్వడం విశేషం. ఇక కుటుంబం మద్దుతు ఉంటే ఏదైనా సాధించవచ్చని అంటోంది రియా. అదే సమయంలో విజయం అందుకోవాలంటే మన వద్ద సహనం, పట్టుదల తోపాటు అంకితభావం ఉండటం అత్యంత ముఖ్యం అని రియా పేర్కొంది.
(చదవండి: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం..భయం గుప్పెట్లో దేశాలు!)
Comments
Please login to add a commentAdd a comment