ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్, అసిస్టెంట్ అత్యాచారం | bus driver and his assistant rape lady passenger | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్, అసిస్టెంట్ అత్యాచారం

Published Sat, May 7 2016 4:10 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్, అసిస్టెంట్ అత్యాచారం

ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్, అసిస్టెంట్ అత్యాచారం

జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. అక్కడి నుంచి బిహార్ వెళ్తున్న ఓ మహిళపై బస్సులోనే అత్యాచారం జరిగింది. ఈ దారుణం కోడెర్మా జిల్లాలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళ జార్ఖండ్ లోని కోడెర్మా జిల్లా నుంచి బిహార్‌లోని నవడా జిల్లాకు శ్రీ ట్రావెల్స్ అనే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సులో బయల్దేరింది. ప్రయాణికులలో మిగిలినవాళ్లంతా కోడెర్మా జిల్లాలోని తిలైయ్యా అనే ప్రాంతంలో దిగిపోయిన తర్వాత.. డ్రైవర్ బస్సును నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లాడు.

అక్కడ అతడితో పాటు అతడి అసిస్టెంట్ కూడా ఆ మహిళపై అత్యాచారం చేశారు. ఆమెకు వైద్యపరీక్షలు చేయిస్తామని, నిందితులను అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు మొదలయ్యాయని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలో సగటున ప్రతి 8-9 గంటలకు ఒక మహిళ లేదా బాలికపై అత్యాచారం జరుగుతున్నట్లు నేర రికార్డుల బ్యూరో లెక్కలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement