నాయుడుపేట-పెళ్లకూరు మండలాల సరిహద్దు ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున 3 గంటలకు వోల్వో బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.
ప్రయాణికులు సురక్షితం
నాయుడుపేట : నాయుడుపేట-పెళ్లకూరు మండలాల సరిహద్దు ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున 3 గంటలకు వోల్వో బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న వోల్వో బస్సు ఇంజన్ ఆయిల్ ట్యాంక్‌కు రంధ్రం పడింది. గోమతి సెంటర్ నుంచి రోడ్డుపై ఆయిల్ చిమ్మేసింది. అర కిలో మీటరు దూరం వరకు ఆయిల్ రోడుపై పోవడంతో వెనుక వైపు వస్తున్న వాహనం చోదకులు ట్యాంక్‌కు రంధ్రం పడిన విషయాన్ని వోల్వో బస్సు డ్రైవర్‌కు తెలియజేశారు.
అప్పటికే వోల్వో బస్సు టైర్లకు ఆయిల్ అంటుకుని జారుతూ అదుపు తప్పింది. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేశారు. ప్రయాణికులు 3 గంటల నుంచి తెల్లవారే వరకు అవస్థ పడ్డారు. ప్రమాదవశాత్తు ట్యాంక్ నుంచి రంధ్రం ఏర్పడిన ప్రాంతంలో మంటలు చెలరేగి ఉంటే ఘోర ప్రమాదం జరిగేదని డ్రైవర్, ప్రయాణికులు తెలిపారు.