
గుండెపోటుకు గురై బస్సులోనే మృతి చెందిన డ్రైవర్ భాస్కర్
బిట్రగుంట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): బోగోలు మండలం కడనూతల సమీపంలో ఓ టూరిస్టు బస్సు డ్రైవర్ ప్రయాణికులను కాపాడి తాను మృత్యుఒడిలో ఒరిగిపోయాడు. దీంతో అయ్యప్ప భక్తులతో వెళుతున్న టూరిస్ట్ బస్సుకు గురువారం తృటిలో పెనుప్రమాదం తప్పింది. బస్సులోని అయ్యప్ప భక్తుల కథనం మేరకు.... కిర్లంపూడి మండలం తామరక గ్రామానికి చెందిన 45 మంది అయ్యప్ప భక్తులు శబరిమలలో దీక్ష పూర్తి చేసుకుని ఈ నెల 20న తిరుగు ప్రయాణమయ్యారు.
కడనూతల వద్ద ఫ్‌లైఓవర్‌పైన విశాఖపట్నానికి చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్ (39) గుండెపోటుకు గురయ్యాడు. ఊపిరి ఆడకపోవడంతో వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి చాకచక్యంగా బస్సును ఫ్‌లైఓవర్‌పైనే ఒక పక్కగా నిలిపేశాడు. గుండెనొప్పిగా ఉందంటూ క్లీనర్‌కు చెబుతూనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. బస్సు ఏమాత్రం అదుపుతప్పినా ఘోరప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న బిట్రగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment