
గమ్యస్థలం రాగానే బస్సును ఆపేశాడు డ్రైవర్. ప్రయాణికులందరూ దిగుతుండగా ఓ చిన్నారి మాత్రం నేరుగా అతని దగ్గరకు వెళ్లి ముచ్చటించింది. అప్పటికే అతను మరో ట్రిప్పు వేయడం కోసం సిద్ధం కావాల్సి ఉంది. కానీ అతను ఎలాంటి చిరాకు ప్రదర్శించకుండా ఆమెతో ముచ్చట్లాడాడు. ఇక పాప తనకు ‘షేక్ ఇట్ ఆఫ్’ పాటంటే ఎంతో ఇష్టమని చెప్పింది. వెంటనే ఆయన అవునా! అయితే మనిద్దరం ఇప్పుడా పాటకు డ్యాన్స్ చేద్దాం అంటూ స్టెప్పులేయం ప్రారంభించాడు. దీంతొ ఆ చిన్నారి సంతోషంతో గెంతులు వేస్తూ పాటకు తగ్గట్టుగా కాలు కదిపింది. ఇక బస్సు డ్రైవర్ సీటు బెల్టు కూడా తీయకుండా కూర్చున్న సీటులో నుంచే డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.(వైరల్: చావు అంచుల దాక వెళ్లి..)
ఇదంతా 2018 నాటి సంగతి కాగా దీనికి సంబంధించిన వీడియోను 11 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. తాజాగా రెక్స్ చాప్‌మన్ అనే వ్యక్తి ఈ వీడియోను తిరిగి పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే దీన్ని వీక్షించిన వారి సంఖ్య 8 మిలియన్ల మార్క్‌ను దాటి ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ‘నాకంటే బాగా డ్యాన్స్ చేశాడు, సీటుబెల్టు ధరించి కూర్చున్న చోట నుంచే ఆడిపాడాడు’, ‘బెస్ట్ చెయిర్ డ్యాన్సింగ్ అవార్డు ఇవ్వాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇలాంటి ప్రేమే కావాలి, ప్రపంచమంతా దానితో నిండిపోవాలి’, ‘ఇది కదా మాక్కావాల్సింది..’ అంటూ కొంతమంది మీమ్స్ ద్వారా రిప్లై ఇస్తున్నారు. (తిన్నాక తెలిస్తే వాంతి చేసుకుంటారు!)
Comments
Please login to add a commentAdd a comment