బస్ డ్రైవర్ కు గుండెపోటు: ప్రయాణికులకు గాయాలు
కోల్హాపూర్ (మహారాష్ట్ర): బస్సు నడుపుతుండగా డ్రైవర్కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు సోమవారం నవ్లీ గ్రామం మీదుగా వెళుతుండగా డ్రైవర్ బాబూరావ్ సావంత్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దాంతో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా.. 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.