2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 543 స్థానాలకు 7 దశల్లో ఓటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ అలయన్స్ రెండూ తమ తమ విజయాలను ప్రకటించుకుంటున్నాయి.
ఫలితాలు వెలువడకముందే విజయోత్సవ సంబరాలు జరుపుకునేందుకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఎగ్జిట్ పోల్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ నేతల, కార్యకర్తల ఉత్సాహం తారా స్థాయికి చేరింది. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎగ్జిట్ పోల్స్‌ను తాము అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నాయి.
మరోవైపు ఓట్ల లెక్కింపునకు ముందే రాజస్థాన్‌లోని బీజేపీ కార్యాలయాన్ని అందంగా అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు 13 వేల మందికి పైగా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | BJP party office in Rajasthan's Jaipur is decorated ahead of the Lok Sabha polls result, today.
Vote counting of #LokSabhaElections to begin at 8 am.
(Video Source: BJP, Rajasthan) pic.twitter.com/pq8MuZEemD— ANI (@ANI) June 4, 2024
Comments
Please login to add a commentAdd a comment