సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెలువడుతున్నాయి. ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో అధికార టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కొన్ని వార్డుల్లో విజయం సాధించినప్పటికీ.. అనుకున్న స్థాయిలో రాణించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. అలాగే వర్థన్నపేట, జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ కూడా టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకుంది. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్‌డేట్స్)
కమలం బోణి..
ఆమన్‌గల్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకున్న బీజేపీ.. అనుకున్న స్థాయిలోనే ప్రణాళిలకు రచించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పలుచోట్ల కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన భైంసాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 14 పోల్ అవ్వగా.. బీజేపీకి 8, ఎంఐఎం 3, కాంగ్రెస్ 1,ఇతరులకు 1 ఓటు దక్కించున్నారు. అయితే ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో నాలుగు వార్డుల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో బీజేపీ గెలుపొందింది. మరోవైపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నాలుగు వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. మరికొన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పలు వార్డుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment