సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ 55 స్ధానాల్లో గెలుపొందినా ఆశ్చర్యం లేదని అన్నారు. అంతకుముందు బీజేపీ నేత విజయ్ గోయల్ మంగళవారం ఉదయం కన్నాట్‌ప్లేస్‌లో హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఇక కౌంటింగ్‌కు ముందు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన నివాసంలో ప్రార్ధన చేశారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment