ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి గెలుస్తారని ఇప్పటికే దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ రోజు (జూన్ 4) వచ్చే ఫలితాలే.. బీజేపీ సర్కార్ మళ్ళీ కేంద్రంలో వస్తుందా? వస్తే ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయాలు వెల్లడవుతాయి.
ఎన్నికల ప్రచారంలో మోదీ చెప్పిన 'అబ్‌కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్' అనే నినాదాన్ని ప్రతిపక్షాలు అపహేళన చేశాయి. ఇప్పటి వరకు వచ్చిన 12 ప్రధాన సర్వేలు, బీజేపీ గెలుస్తుందనే చెబుతున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవేళా మోదీ ఈ మ్యాజిక్ ఫిగర్‌ను కొట్టినట్లయితే.. అది పెద్ద రికార్డ్ కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రికార్డ్‌ను ఎప్పుడో కాంగ్రెస్ దశాబ్దాల ముందే ఖాతాలో వేసుకుంది.
1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.
నాలుగు దశబ్దాలకు ముందు.. యూపీలో 83, బీహార్‌లో 48, మహారాష్ట్రలో 43, గుజరాత్‌లో 24, అలాగే మధ్యప్రదేశ్‌లో 25, రాజస్థాన్‌లో 25, హర్యానాలో 10, ఢిల్లీలో 7, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.
2019లో బీజేపీ 353 స్థానాల్లో గెలిచింది. దీంతో నరేంద్ర మోదీ ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు. 2004లో కూడా బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయం సాధించింది. అయితే ఇప్పుడు అబ్‌కీ బార్ 400 పార్ నినాదం కీలకమైనదిగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ పార్టీ యుపి (68), బీహార్ (33), మహారాష్ట్ర (29), రాజస్థాన్ (21), మరియు హర్యానా (7), అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో క్లీన్ స్వీప్‌ను అందజేస్తుందని చెబుతున్నాయి. ఈ సారి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనేది సర్వత్రా ఉత్కంఠభరితమైంది.
Comments
Please login to add a commentAdd a comment