దేశంలో దాదాపు నెల రోజుల పాటు వివిధ దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేసే పోలింగ్ పార్టీలు పలు అవస్థలను ఎదుర్కొంటున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో పోలింగ్ నిర్వహణ సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని సదర్ నియోజక వర్గం పరిధిలోగల పలు పోలింగ్ బూత్‌లలో పనిచేస్తున్న పోలింగ్ సిబ్బంది మీడియాకు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. కొన్ని చోట్ల కరెంటు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఫోన్ల టార్చ్ వెలుతురు సాయంతో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల నీటి కుండల స్టాండ్‌లు మాత్రమే ఉన్నాయని, నీటి కుండలు మాత్రం లేవని వాపోయారు. పైఅధికారులకు చెప్పినా ఫలితం లేదని వారు వాపోతున్నారు.
సదర్ అసెంబ్లీ పోలింగ్ కేంద్రమైన బూత్ 31వ బూత్ ప్రిసైడింగ్ అధికారి మహ్మద్ ఇబ్రహీం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఐదు నిమిషాలకు విద్యుత్ ట్రిప్ అవుతోందని, దీంతో పోలింగ్‌కు ఏర్పాట్లు సరిగా చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. బూత్ నంబర్ 39 ప్రిసైడింగ్ అధికారి కమత ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ ఉన్నా బల్బులు లేవని అన్నారు. దీంతో కొవ్వొత్తులు లేదా మొబైల్ టార్చ్‌లతో పోలింగ్‌కు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment