
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఇటీవల జరిగిన తొక్కిసలాట పెనువిషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 121 మంది మృతి చెందారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మెయిన్‌పురిలోని బిచ్వాన్ పట్టణంలో ఉన్న సాకర్ హరి ఆశ్రమంపై నిరంతర పోలీసు నిఘా కొనసాగుతోంది.
హత్రాస్ ఘటన అనంతరం సకార్ హరి ఆశ్రమానికి వచ్చే బాబా అనుచరుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. హత్రాస్ ఘటన జరిగి ఏడు రోజులు గడిచాయి. కేసు దర్యాప్తునకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు, నిందితులను హత్రాస్ పోలీసులు జైలుకు తరలిస్తున్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఆశ్రమంపై కన్నేసి ఉంచాయి. ఇంటెలిజెన్స్ శాఖ సిబ్బంది స్థానికుల కదలికలపై నిఘా పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment