photo credit: INDIATODAY
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ మృతితో తమకు న్యాయం జరిగిందని 2005లో అన్సారీ చేతిలో హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. కృష్ణానందరాయ్ కుమారుడు పియూష్ రాయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్సారీ మృతితో తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పారు.
‘బాబా గోరక్‌నాథ్ దయతోనే మాకు న్యాయం జరిగింది. రంజాన్ నెలలోనే అన్సారీకి దేవుడు తగిన శిక్ష విధించాడు. పంజాబ్‌లోని జైళ్లలో ఉండి కూడా అన్సారీ అక్కడి నుంచి నేరాలకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన తర్వాత అతడికి తగిన శాస్తి జరిగింది. ప్రతిపక్షాలకు కేవలం రాజకీయాలు కావాలి.
ఒక క్రిమినల్‌కు ఆయా పార్టీల నేతలు మద్దతు పలకడం దారుణం’అని పియూష్ రాయ్ వ్యాఖ్యానించారు. అన్సారీ నేరాల వల్ల గాయపడ్డ కుటుంబాలకు ఇప్పుడు న్యాయం జరిగిందని, తాము సంతోషంగా ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ భార్య అల్కా రాయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment