అరటి గెల, గుమ్మడికాయలు, పనస, పైనాపిల్... ఇవన్నీ తోటలో పండుతాయి. డిజైనర్ జెంజుమ్ ఇత్తడి నమూనాలతో ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉండే పండ్లను, కూరగాయలను సృష్టించాడు. ‘ప్రకృతికి, అతని తల్లికి, తన జీవితానికి గుర్తుగా వీటిని సృష్టించాను’ అని చెబుతాడు జెంజుమ్. అరుణాచల్ ప్రదేశ్‌లోని టిర్బిన్ అనే చిన్న గ్రామంలో జన్మించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జెంజుమ్.
తన చిన్ననాటి జ్ఞాపకాలను బతికించుకోవాలన్నది అతని తాపత్రయం. వినోదం అందుబాటులో లేని ప్రదేశంలో పెరిగినందున, 1980లలో చిన్న పిల్లవాడిగా అతని తీరిక పనిలో చెట్లు ఎక్కడం, తేనెటీగలను వెంబడించడం, నదుల్లో ఈత కొట్టడం, చేపలు పట్టడం, పర్వతాలలో హైకింగ్ చేయడం వంటివి ఉన్నాయి. ప్రకృతి అతని ఏకైక ఆట స్థలం. ఇప్పుడు ఆ ప్రకృతినే తన తొలి ఆర్ట్ షో ‘అపాసే’ను ప్రదర్శనకు పెట్టాడు, ఇది బెంజుమ్ స్థానిక గాలో మాండలికంలో అక్షరాలా ’వివిధ రకాల పండ్లు’ అని అర్ధం.
జ్ఞాపకాల తోట
‘‘మా ఊరిలో ప్రతి ఇంటికీ తోట ఉంటుంది. పువ్వులకు బదులుగా వాటిలో కూరగాయలు, పండ్లు పండిస్తాం. రైతు అయిన నా తల్లి ఎప్పుడూ గ్రామంలోనే ఉంటూ తన జీవితమంతా మా తోటలో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఉండేది. వాటికి విత్తనాలు నిల్వచేసేది. అక్కడ సమయం గడపడం నా సృజనాత్మక పనిని లోతుగా ప్రభావితం చేసింది. ప్రకృతితో ఈ కనెక్షన్ ఇప్పుడు నా డిజైన్లలోకి విస్తరించింది. ఆ జ్ఞాపకాలను మళ్లీ పునశ్చరణ చేసి, వాటికి ఒక సాక్షాత్కార రూపం ఇవ్వాలన్న నా ప్రయత్నమే ‘అపాసే’’’ అని బెంజుమ్ చెబుతారు.
ఇత్తడి ఫ్రూట్స్
ఇత్తడితో రూపొందించిన 16 త్రీ–డైమెన్షనల్ ఫ్రూట్ మోడల్ అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కళారూపం బెంజుమ్ తల్లి తోట నుండి ఒక పండు, కూరగాయలను సూచిస్తుంది. ఈ డిజైన్స్‌తో బెంజుమ్ ప్రదర్శన కూడా నిర్వహించాడు. 12, 44 అంగుళాల అరటి గెల, పైనాపిల్స్, బొప్పాయిలు, జాక్‌ఫ్రూట్స్, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, దానిమ్మపండ్లు – కళాకారుడి పనితీరును వెలుగులోకి తెచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని రూపా అనే చిన్న గ్రామంలో టిబెటన్ మఠాల కోసం సాంప్రదాయ ఇత్తడి వస్తువులను రూ పొందించడంలో నైపుణ్యం కలిగిన స్థానిక కళాకారులు ఉన్నారు. రాష్ట్రంలోని పశ్చిమాన ఉన్న తవాంగ్, ఆసియాలో అతి ప్రాచీనమైన, రెండవ అతిపెద్ద బౌద్ధ ఆశ్రమానికి నిలయం ఉంది. ఆ ఆశ్రమాలను సందర్శించిన బెంజుమ్ నిజమైన పండ్లను అచ్చులుగా ఉపయోగించడం, వాటిని శాశ్వతమైన ఇత్తడి ప్రదర్శనలుగా మార్చడంపై ఆసక్తిని పెంచింది. బెంజూమ్ ఢిల్లీలో నివసిస్తున్నాడు. తన ఢిల్లీ తోటలో బెంజుమ్ మామిడి, బొ΄్పాయి, అవకాడో, సీతాఫలం, అరటి, నిమ్మకాయలు వంటి వివిధ రకాల పండ్లను సీజన్‌ను బట్టి పండిస్తాడు. అయితే అతనికి ఇష్టమైనది నారింజ. ‘‘నారింజ చెట్లు సాధారణంగా ముళ్లతో ఉంటాయి, కానీ చెట్ల వయస్సు పెరిగే కొద్దీ ముళ్ళు తగ్గిపోతాయి. నారింజ పండ్లను కోయడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం, ముళ్ల నుండి వచ్చిన కొద్దిపాటి గాయాలను తీర్చే పండ్ల మాధుర్యం నాకు చిన్ననాటి జ్ఞాపకాలుగా ఉన్నాయి’’ అని బెంజుమ్ గుర్తు చేసుకుంటాడు.
కళను బతికించాలి..
ఈశాన్య ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే కొద్దిమంది డిజైనర్లు, కళాకారులలో బెంజుమ్ ఒకరు. ‘ప్రక్రియ నెమ్మదిగా ఉంది, కానీ మొత్తానికి ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ప్రాంతం నుండి కొత్త తరం యువ కళాకారులు ఉద్భవించడాన్ని నేను గమనించాను. వారిలో ఈ కళ పట్ల అవగాహన పెంచాలి, సృజనాత్మకతను మెరుగుపరచాలి’ అని వివరిస్తాడు బెంజుమ్. బెంజుమ్ ప్రతిభ బట్టలు డిజైన్ చేయడం, సినిమాల్లో నటించడం వరకే కాదు ఇప్పుడు ఈ కళారూపాలతో బిజీ అయిపోతే తిరిగి పెద్ద స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామని అక్కడి వారు అడుగుతుంటారు. బెంజుమ్ నవ్వుతూ ‘ముందు చేస్తున్న పనిపైనే సంపూర్ణ దృష్టి పెడుతున్నాను’ అంటారు జెంజుమ్.
Comments
Please login to add a commentAdd a comment