Art Show
-
తోట కాని తోట : చిరస్థాయిగా నిలిచిపోయే తోట!
అరటి గెల, గుమ్మడికాయలు, పనస, పైనాపిల్... ఇవన్నీ తోటలో పండుతాయి. డిజైనర్ జెంజుమ్ ఇత్తడి నమూనాలతో ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉండే పండ్లను, కూరగాయలను సృష్టించాడు. ‘ప్రకృతికి, అతని తల్లికి, తన జీవితానికి గుర్తుగా వీటిని సృష్టించాను’ అని చెబుతాడు జెంజుమ్. అరుణాచల్ ప్రదేశ్‌లోని టిర్బిన్ అనే చిన్న గ్రామంలో జన్మించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జెంజుమ్. తన చిన్ననాటి జ్ఞాపకాలను బతికించుకోవాలన్నది అతని తాపత్రయం. వినోదం అందుబాటులో లేని ప్రదేశంలో పెరిగినందున, 1980లలో చిన్న పిల్లవాడిగా అతని తీరిక పనిలో చెట్లు ఎక్కడం, తేనెటీగలను వెంబడించడం, నదుల్లో ఈత కొట్టడం, చేపలు పట్టడం, పర్వతాలలో హైకింగ్ చేయడం వంటివి ఉన్నాయి. ప్రకృతి అతని ఏకైక ఆట స్థలం. ఇప్పుడు ఆ ప్రకృతినే తన తొలి ఆర్ట్ షో ‘అపాసే’ను ప్రదర్శనకు పెట్టాడు, ఇది బెంజుమ్ స్థానిక గాలో మాండలికంలో అక్షరాలా ’వివిధ రకాల పండ్లు’ అని అర్ధం.జ్ఞాపకాల తోట‘‘మా ఊరిలో ప్రతి ఇంటికీ తోట ఉంటుంది. పువ్వులకు బదులుగా వాటిలో కూరగాయలు, పండ్లు పండిస్తాం. రైతు అయిన నా తల్లి ఎప్పుడూ గ్రామంలోనే ఉంటూ తన జీవితమంతా మా తోటలో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఉండేది. వాటికి విత్తనాలు నిల్వచేసేది. అక్కడ సమయం గడపడం నా సృజనాత్మక పనిని లోతుగా ప్రభావితం చేసింది. ప్రకృతితో ఈ కనెక్షన్ ఇప్పుడు నా డిజైన్లలోకి విస్తరించింది. ఆ జ్ఞాపకాలను మళ్లీ పునశ్చరణ చేసి, వాటికి ఒక సాక్షాత్కార రూపం ఇవ్వాలన్న నా ప్రయత్నమే ‘అపాసే’’’ అని బెంజుమ్ చెబుతారు. ఇత్తడి ఫ్రూట్స్ఇత్తడితో రూపొందించిన 16 త్రీ–డైమెన్షనల్ ఫ్రూట్ మోడల్ అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కళారూపం బెంజుమ్ తల్లి తోట నుండి ఒక పండు, కూరగాయలను సూచిస్తుంది. ఈ డిజైన్స్‌తో బెంజుమ్ ప్రదర్శన కూడా నిర్వహించాడు. 12, 44 అంగుళాల అరటి గెల, పైనాపిల్స్, బొప్పాయిలు, జాక్‌ఫ్రూట్స్, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, దానిమ్మపండ్లు – కళాకారుడి పనితీరును వెలుగులోకి తెచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని రూపా అనే చిన్న గ్రామంలో టిబెటన్ మఠాల కోసం సాంప్రదాయ ఇత్తడి వస్తువులను రూ పొందించడంలో నైపుణ్యం కలిగిన స్థానిక కళాకారులు ఉన్నారు. రాష్ట్రంలోని పశ్చిమాన ఉన్న తవాంగ్, ఆసియాలో అతి ప్రాచీనమైన, రెండవ అతిపెద్ద బౌద్ధ ఆశ్రమానికి నిలయం ఉంది. ఆ ఆశ్రమాలను సందర్శించిన బెంజుమ్ నిజమైన పండ్లను అచ్చులుగా ఉపయోగించడం, వాటిని శాశ్వతమైన ఇత్తడి ప్రదర్శనలుగా మార్చడంపై ఆసక్తిని పెంచింది. బెంజూమ్ ఢిల్లీలో నివసిస్తున్నాడు. తన ఢిల్లీ తోటలో బెంజుమ్ మామిడి, బొ΄్పాయి, అవకాడో, సీతాఫలం, అరటి, నిమ్మకాయలు వంటి వివిధ రకాల పండ్లను సీజన్‌ను బట్టి పండిస్తాడు. అయితే అతనికి ఇష్టమైనది నారింజ. ‘‘నారింజ చెట్లు సాధారణంగా ముళ్లతో ఉంటాయి, కానీ చెట్ల వయస్సు పెరిగే కొద్దీ ముళ్ళు తగ్గిపోతాయి. నారింజ పండ్లను కోయడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం, ముళ్ల నుండి వచ్చిన కొద్దిపాటి గాయాలను తీర్చే పండ్ల మాధుర్యం నాకు చిన్ననాటి జ్ఞాపకాలుగా ఉన్నాయి’’ అని బెంజుమ్ గుర్తు చేసుకుంటాడు. కళను బతికించాలి..ఈశాన్య ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే కొద్దిమంది డిజైనర్లు, కళాకారులలో బెంజుమ్ ఒకరు. ‘ప్రక్రియ నెమ్మదిగా ఉంది, కానీ మొత్తానికి ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ప్రాంతం నుండి కొత్త తరం యువ కళాకారులు ఉద్భవించడాన్ని నేను గమనించాను. వారిలో ఈ కళ పట్ల అవగాహన పెంచాలి, సృజనాత్మకతను మెరుగుపరచాలి’ అని వివరిస్తాడు బెంజుమ్. బెంజుమ్ ప్రతిభ బట్టలు డిజైన్ చేయడం, సినిమాల్లో నటించడం వరకే కాదు ఇప్పుడు ఈ కళారూపాలతో బిజీ అయిపోతే తిరిగి పెద్ద స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామని అక్కడి వారు అడుగుతుంటారు. బెంజుమ్ నవ్వుతూ ‘ముందు చేస్తున్న పనిపైనే సంపూర్ణ దృష్టి పెడుతున్నాను’ అంటారు జెంజుమ్. -
అనుమానితుడు
దేవా మంచి చిత్రకారుడు. ఇప్పుడిప్పుడే అతడి చిత్రాలు మార్కెట్లో మంచి ధర పలుకుతున్నాయి.స్నేహితులు, సన్నిహితుల సలహా మేరకు తొలిసారిగా నగరంలో ‘ఆర్ట్ కార్నర్’ గ్యాలరీలో ఆర్ట్ షో ఏర్పాటు చేశాడు. మంచి స్పందన వచ్చింది. ఆర్ట్ షో మొదలై ఆరు రోజులవుతోంది.ఆరోజు పండగ కావడంతో సందర్శకులు పెద్దగా లేరు.ఏదో అర్జంటు కాల్ రావడంతో...ఒక స్నేహితుడిని గ్యాలరీలో కూర్చోమని చెప్పి బయటికి వెళ్లాడు దేవా.గ్యాలరీలో కూర్చున్న ఆ స్నేహితుడు... కొద్దిసేపటి తరువాత ఒక నవల చదవడంలో నిమగ్నమైపోయాడు.సాయంత్రం పూట గ్యాలరీకి వచ్చిన దేవా కొద్దిసేపటి తరువాత షాక్ తిన్నాడు.తనకు ఎంతగానో పేరు తెచ్చిన ‘ది బ్లూ రోజ్’ పెయింటింగ్ మాయమైంది! షాక్‌లో నుంచి తేరుకొని.... ‘‘ది బ్లూ రోజ్‌ను ఎవరైనా అడిగారా?’’ అన్నాడు స్నేహితుడితో.‘‘ఎవరూ అడగలేదు’’ తాపీగా చెప్పాడు ఆ స్నేహితుడు.‘‘ది బ్లూ రోజ్ పెయింటింగ్‌ను ఎవరో దొంగిలించారు’’ విషయం చెప్పాడు దేవా. స్నేహితుడు షాక్ తిన్నాడు.ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆరోజు గ్యాలరీకి వచ్చిన సందర్శకులు అయిదు మంది.గ్యాలరీ హాల్లో ఎలాంటి వీడియో, కెమెరాలు లేవు.అందుకే పోలీసులు ‘ఎంట్రెన్స్ వీడియో’ను పరిశీలించారు. మధ్యాహ్నం 1:10... ఒక మహిళ వచ్చారు.ఆతరువాత... 2: 06 ...ఒక పెద్దాయన వచ్చారు. 2:47.... ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు. 3: 33....ఒక యువకుడు వచ్చాడు. ఈ అయిదుగురు బయటికి వెళుతున్నప్పటి దృశ్యాలను చూశారు. ఎవరి చేతుల్లోనూ పెయింటింగ్ కనిపించలేదు. మరో విశేషం ఏమిటంటే...ఈ అయిదుగు బ్యాగ్‌లు లాంటి వస్తువులేమీ లేకుండా ఖాళీ చేతులతోనే గ్యాలరీకి వచ్చారు. అయినప్పటికీ.... చివర్లో వచ్చిన యువకుడిని ‘దొంగ’గా తేల్చారు. ఏ ఆధారంతో పోలీసులు ఆ యువకుడిని అనుమానించారు? 2 తన గదిలో నిద్రపోతున్న బలరామ్‌ను విండో నుంచి కాల్చి చంపారు హంతకులు. పోలీసులు ఆధారాల కోసం వెదకడం మొదలు పెట్టారు. ఒక చోట... షూ గుర్తులు కనిపించాయి. అన్నీ... సైజ్ నంబర్ 10 పోలీసులు ముగ్గురిని అనుమానించారు. 1.రాజు 2.రవి 3.రమణ రాజు షూస్ సైజ్.... 9 రవి షూస్ సైజ్..... 10 రమణ షూస్ సైజ్... 9 ‘‘ఇక ఆలస్యం ఎందుకు? రవే హంతకుడు. అరెస్ట్ చేద్దాం’’ అంటూ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే హత్యతో రవికి ఎలాంటి సంబంధం లేదనే విషయం తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. ఏ ఆధారంతో పోలీసులు రవి హంతకుడు కాదని, రాజు, రమణ హంతకులని తేల్చారు? 1 గ్యాలరీలోకి ప్రవేశించే ముందు... ఆ యువకుడు టక్ చేయలేదు. గ్యాలరీ నుంచి వెళ్లేటప్పుడు మాత్రం... టక్ చేసి కనిపించాడు. దొంగిలించిన పెయింటింగ్‌ను షర్ట్ లోపల దాచాడు. 2 నేరం రవి మీద పోవడానికే... 10 సైజ్ షూస్ ధరించి హత్యకు పాల్పడ్డారు రాజు, రమణ. గమనించాల్సిన విషయం ఏమిటంటే హత్యకు ఒకరోజు ముందు రవి దుబాయికి వెళ్లాడు. ఈ విషయం హంతకులకు తెలియదు! -
మాబ్ మానియా
ఉరుములేని మెరుపులా ఊడిపడతారు. తరుముకొస్తున్న తుపానులా ఊగిపోతారు. ఈ వేళ ఏదో ఒకటి అదరగొడదాం అంటూ ఊపిరి సలపనివ్వని సంగీతంతో ఊర్రూతలూగిస్తారు. మరపురాని నృత్యాన్ని అందిస్తారు. షాపింగ్ మాల్స్ కావచ్చు.. వాకింగ్ రోడ్స్ కావచ్చు.. కావేవీ కళా ప్రదర్శనకు అనర్హం అంటున్న ఈ డ్యాన్సర్లలో ఐటీ ఉద్యోగులూ ఉండటం విశేషం. విద్యాధికులను సైతం భాగస్వాముల్ని చేస్తున్న ఈ ఫ్లాష్ డ్యాన్స్‌లు సమాజానికి ఉపకరించే చక్కని సందేశాలను సైతం మోసుకొస్తున్నాయి. మారథాన్ తరహాలో సిటీలో రెగ్యులర్ ఈవెంట్లుగా స్థిరపడుతున్నాయి. - ఎస్.సత్యబాబు మాబ్ అనే ఆంగ్ల పదానికి సంఘ వ్యతిరేకుల సమూహం అనే చెడు అర్థం ఉంది. అయితే సందేశాత్మక ‘షో’లతో మన నగరం ఈ అర్థాన్ని సమూలంగా మార్చేస్తోంది. కొంతకాలం క్రితం సిటీలో ప్రారంభమైన ఫ్లాష్‌మాబ్‌లు ఇటీవల నృత్యాభిమానులతో పాటు సామాజిక సేవాభిలాషులను కూడా ఆకట్టుకుంటున్నాయి. డ్యాన్స్ ఫర్ కాజ్... కొన్ని రోజుల క్రితం కూకట్‌పల్లిలోని ఒక మాల్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఫ్లాష్డ్యాన్సర్లు అదిరిపోయే స్టెప్స్‌తో షాపర్స్‌ను కట్టిపడేశారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన నృత్యవేగం చివర్లో నిదానించినప్పుడు.. చక్ దే ఇండియా సినిమాలోని స్లో సాంగ్ వస్తుండగా ఉమెన్ సేఫ్టీ స్లోగన్స్ ఉన్న ప్లకార్డ్స్ పట్టుకున్నారు. అంతవరకూ ఉర్రూతలూగించిన డ్యాన్సర్లు.. సందేశాత్మక అంబాసిడర్లుగా మారిపోయారు. అటు వినోదాన్ని ఇటు ఓ సందేశాన్ని అందించిన ఈ తరహా సందడి అక్కడి జనాలకు గ్రేట్ మెమొరీగా మిగిలిపోయింది. ఫ్లాష్.. ఫ్లాష్.. ‘వృత్తిరీత్యా ఫిట్నెస్ ట్రైనర్‌ని. చేంజ్ కోసం మా స్టూడెంట్స్‌తో కలిసి ఓ ఫ్లాష్‌మాబ్ నిర్వహించాలి అనుకున్నప్పుడే వీటికి ఒక సందేశాన్ని జోడించాలని నిర్ణయించుకున్నా. సిటీలో ఇలా మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఫ్లాష్‌మాబ్‌లు జరగకపోవడంతో దానికి మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆ తరహా ప్రోగ్రాం అంటే మమ్మల్ని సంప్రదించేవారు పెరిగారు’ అని బాబీ చెప్పారు. మాదాపూర్‌లో బాబీ ఫిట్నెస్ ఫ్యూజన్ స్టూడియోను నిర్వహిస్తున్న బాబీ.. ఆడశిశువుల రక్షణార ్థం పింక్ రిబ్బన్ వాక్, రోడ్ సేఫ్టీ, పొల్యూషన్, హుదుద్ తుఫాన్ బాధితుల సహాయార్థం.. ఇలా పలు అంశాల నేపథ్యంలో మెరుపు నృత్యాలను నిర్వహించారు. అవర్ రోడ్స్, అవర్ ఫ్రీడమ్ అంటున్న వీక్లీ ఈవెంట్ రాహ్‌గిరిలో ప్రతి వారం నృత్య సందడి సృష్టిస్తోంది బాబీ అండ్ కోనే. ‘ప్లాష్‌మాబ్ చూసేవారి అటెన్షన్‌ను తొందరగా అందుకుంటుంది. ఇలాంటివి మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉండటం అనేది మరింత ప్రయోజనకరం. మాకు నచ్చిన కార్యక్రమంలో పాల్గొంటాం తప్ప వీటిలో వేటికీ మేం రెమ్యునరేషన్ తీసుకోం’ అని బాబీ చెప్పారు. ఇప్పటికి అరడజనుకుపైగా మెసేజ్ ఓరియెంటెడ్ ఫ్లాష్ డ్యాన్స్ షోలు నిర్వహించిన బాబీ అండ్ కో కోసం ప్రస్తుతం స్వచ్ఛ భారత్, కేన్సర్ అవేర్నెస్ వంటి మరికొన్ని ఈవెంట్లు, ఇన్వైట్లు సిద్ధంగా ఉన్నాయి. అవేర్నెస్ త్రూ డ్యాన్స్... ఏ నొప్పయినా వ్యక్తిగతంగా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి అప్పటిదాకా అదొక సమస్య కాదనే ధోరణి సరికాదు. ముందస్తు అవగాహన కలిగించడం అవసరం. అలాంటి సందేశాలకు క్రౌడ్‌ని ఈజీగా ఎట్రాక్ట్ చేసే ఫ్లాష్‌మాబ్ ఓ చక్కని మార్గం. నాకు నచ్చిన పద్ధతిలో నేను కూడా సోషల్ అవేర్నెస్కి ఉపయోగపడటం అనేది నాకు సంతృప్తిని అందిస్తోంది. అందుకే నేను ఫ్లాష్మాబ్స్లో పాల్గొంటున్నాను. - సంతృష్ణ, సీఎస్సీ ఉద్యోగిని ఈజీగా.. క్యాచీగా.. ఫ్లాష్‌మాబ్‌లు కామన్ పీపుల్ మధ్య జరుగుతున్నాయి కాబట్టి వీటికి మెసేజ్‌లు జోడించడం అనేది వండర్ఫుల్ ఐడియా. ఈ ఈవెంట్లలో ఓ రకంగా జనాలు కూడా పార్టిసిపెంట్సే. ఆసక్తిని పెంచడంలో ఈ తరహా డ్యాన్స్‌లు బాగా సక్సెస్ అవుతాయి. అందుకే నేను కూడా మాబ్ పార్టీస్‌లో పాల్గొంటున్నా. -సాయినేత్ర, బీబీఏ విద్యార్థిని