మాబ్ మానియా | Mal Mania in City regular events | Sakshi
Sakshi News home page

మాబ్ మానియా

Published Thu, Jan 29 2015 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

మాబ్ మానియా

మాబ్ మానియా

ఉరుములేని మెరుపులా ఊడిపడతారు. తరుముకొస్తున్న తుపానులా ఊగిపోతారు. ఈ వేళ ఏదో ఒకటి అదరగొడదాం అంటూ ఊపిరి సలపనివ్వని సంగీతంతో ఊర్రూతలూగిస్తారు. మరపురాని నృత్యాన్ని అందిస్తారు. షాపింగ్ మాల్స్ కావచ్చు.. వాకింగ్ రోడ్స్ కావచ్చు.. కావేవీ కళా ప్రదర్శనకు అనర్హం అంటున్న ఈ డ్యాన్సర్లలో ఐటీ ఉద్యోగులూ ఉండటం విశేషం. విద్యాధికులను సైతం భాగస్వాముల్ని చేస్తున్న ఈ ఫ్లాష్ డ్యాన్స్‌లు సమాజానికి ఉపకరించే చక్కని సందేశాలను సైతం మోసుకొస్తున్నాయి. మారథాన్ తరహాలో సిటీలో రెగ్యులర్ ఈవెంట్లుగా  స్థిరపడుతున్నాయి.
 - ఎస్.సత్యబాబు
 
 మాబ్ అనే ఆంగ్ల పదానికి  సంఘ వ్యతిరేకుల సమూహం అనే చెడు అర్థం ఉంది. అయితే సందేశాత్మక ‘షో’లతో  మన నగరం ఈ అర్థాన్ని సమూలంగా మార్చేస్తోంది. కొంతకాలం క్రితం సిటీలో ప్రారంభమైన ఫ్లాష్‌మాబ్‌లు ఇటీవల నృత్యాభిమానులతో పాటు సామాజిక సేవాభిలాషులను కూడా ఆకట్టుకుంటున్నాయి.
 
 డ్యాన్స్ ఫర్ కాజ్...
 కొన్ని రోజుల క్రితం కూకట్‌పల్లిలోని ఒక మాల్‌లో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఫ్లాష్‌డ్యాన్సర్లు అదిరిపోయే స్టెప్స్‌తో షాపర్స్‌ను కట్టిపడేశారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన నృత్యవేగం చివర్లో నిదానించినప్పుడు.. చక్ దే ఇండియా సినిమాలోని స్లో సాంగ్ వస్తుండగా ఉమెన్ సేఫ్టీ  స్లోగన్స్ ఉన్న ప్లకార్డ్స్ పట్టుకున్నారు. అంతవరకూ ఉర్రూతలూగించిన డ్యాన్సర్లు.. సందేశాత్మక అంబాసిడర్లుగా మారిపోయారు. అటు వినోదాన్ని ఇటు ఓ సందేశాన్ని అందించిన ఈ తరహా సందడి అక్కడి జనాలకు గ్రేట్ మెమొరీగా మిగిలిపోయింది.
 
 ఫ్లాష్.. ఫ్లాష్..
 ‘వృత్తిరీత్యా ఫిట్‌నెస్ ట్రైనర్‌ని. చేంజ్ కోసం మా స్టూడెంట్స్‌తో కలిసి ఓ ఫ్లాష్‌మాబ్ నిర్వహించాలి అనుకున్నప్పుడే వీటికి ఒక సందేశాన్ని జోడించాలని నిర్ణయించుకున్నా. సిటీలో ఇలా మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఫ్లాష్‌మాబ్‌లు జరగకపోవడంతో దానికి మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆ తరహా ప్రోగ్రాం అంటే మమ్మల్ని సంప్రదించేవారు పెరిగారు’ అని బాబీ చెప్పారు. మాదాపూర్‌లో బాబీ ఫిట్‌నెస్ ఫ్యూజన్ స్టూడియోను నిర్వహిస్తున్న బాబీ.. ఆడశిశువుల రక్షణార ్థం పింక్ రిబ్బన్ వాక్, రోడ్ సేఫ్టీ, పొల్యూషన్, హుదుద్ తుఫాన్ బాధితుల సహాయార్థం.. ఇలా పలు అంశాల నేపథ్యంలో మెరుపు నృత్యాలను నిర్వహించారు. అవర్ రోడ్స్, అవర్ ఫ్రీడమ్ అంటున్న వీక్లీ ఈవెంట్ రాహ్‌గిరిలో ప్రతి వారం నృత్య సందడి సృష్టిస్తోంది బాబీ అండ్ కోనే. ‘ప్లాష్‌మాబ్  చూసేవారి అటెన్షన్‌ను తొందరగా అందుకుంటుంది. ఇలాంటివి మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉండటం అనేది మరింత ప్రయోజనకరం. మాకు నచ్చిన కార్యక్రమంలో పాల్గొంటాం తప్ప వీటిలో వేటికీ మేం రెమ్యునరేషన్ తీసుకోం’ అని బాబీ చెప్పారు. ఇప్పటికి అరడజనుకుపైగా మెసేజ్ ఓరియెంటెడ్ ఫ్లాష్ డ్యాన్స్ షోలు నిర్వహించిన బాబీ అండ్ కో కోసం ప్రస్తుతం స్వచ్ఛ భారత్, కేన్సర్ అవేర్‌నెస్ వంటి మరికొన్ని ఈవెంట్లు, ఇన్వైట్లు సిద్ధంగా ఉన్నాయి.
 
 అవేర్‌నెస్ త్రూ డ్యాన్స్...
ఏ నొప్పయినా వ్యక్తిగతంగా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి అప్పటిదాకా అదొక సమస్య కాదనే ధోరణి సరికాదు. ముందస్తు అవగాహన కలిగించడం అవసరం. అలాంటి సందేశాలకు క్రౌడ్‌ని ఈజీగా ఎట్రాక్ట్ చేసే ఫ్లాష్‌మాబ్ ఓ చక్కని మార్గం. నాకు నచ్చిన పద్ధతిలో నేను కూడా సోషల్ అవేర్‌నెస్‌కి ఉపయోగపడటం అనేది నాకు సంతృప్తిని అందిస్తోంది. అందుకే నేను ఫ్లాష్‌మాబ్స్‌లో పాల్గొంటున్నాను.      
 - సంతృష్ణ, సీఎస్‌సీ ఉద్యోగిని
 
 ఈజీగా.. క్యాచీగా..
 ఫ్లాష్‌మాబ్‌లు కామన్ పీపుల్ మధ్య జరుగుతున్నాయి కాబట్టి వీటికి మెసేజ్‌లు జోడించడం అనేది వండర్‌ఫుల్ ఐడియా. ఈ ఈవెంట్లలో ఓ రకంగా జనాలు కూడా పార్టిసిపెంట్సే. ఆసక్తిని పెంచడంలో ఈ తరహా డ్యాన్స్‌లు బాగా సక్సెస్ అవుతాయి. అందుకే నేను కూడా మాబ్ పార్టీస్‌లో పాల్గొంటున్నా.
 -సాయినేత్ర, బీబీఏ విద్యార్థిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement