ఒక ఆర్ట్ షోను సందర్శించినప్పుడు మన మనస్సులో కొన్ని ప్రశ్నలు మెదలుతాయి. అవేంటంటే... ‘నేనేం చూస్తున్నాను? ఈ ఆర్ట్ నాకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది? నేను ఏ సందేశాన్ని నాతోపాటు ఇంటికి తీసుకువెళుతున్నాను? ఆర్ట్‌వర్క్ నాతో మాట్లాడుతుందా లేదా నన్ను ఆకర్షిస్తుందా?’ ఇలాంటి ప్రశ్నల సముదాయానికి ‘గ్రేస్‌ఫుల్ స్ట్రోక్స్’ సరైన సమాధానం చెబుతుంది.
అక్కడ మనం ఏ మూల నుండి చూసినా ప్రతి పెయింటింగ్ మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. నృత్యకారుల కళారూపాన్ని పెయింటింగ్స్ చూపి, వాటితో చెన్నయ్‌లో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భరతనాట్యకారులు వారాంతంలో వివిధ కళాకృతులలో, భంగిమల ద్వారా భావోద్వేగాలను తిరిగి సృష్టించడానికి ప్రయత్నించారు.
చెన్నయ్‌లోని ‘గ్రేస్‌ఫుల్ స్ట్రోక్స్’ అనే ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన పెయింటింగ్స్ జాకీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి నమోదయ్యాయి. ఈ రికార్డు కోసం మొత్తం 170 మంది కళాకారులు కలిసి వచ్చారు. వీరికి ప్రముఖ కళాకారుడు – చిత్రకారుడు మణియం సెల్వం, కళాకారుడు–నటుడు–ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్ శ్యామ్, సెయింట్ పాల్స్ మహాజన హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మార్టిన్ సగాయార్జ్ సర్టిఫికేట్ ప్రదానం చేశారు.
పెయింటింగ్ భంగిమలు
ఇండియన్ ఆర్ట్ ఫ్యాక్టరీ సీఇవో సెల్వకన్నన్ ‘యువతను కళలోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామ’ని చెప్పారు. సెల్వకన్నన్ మాట్లాడుతూ ‘భారతీయ కళారూపాలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చాలా మంది ఆర్టిస్టులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక నృత్యకారుడి భంగిమను చిత్రించి ఉండాలి. ఈ ప్రదర్శనల ద్వారా రెండు నేపథ్యాల నుండి ప్రేక్షకులు వస్తారు.
ఒకరు నృత్యకారులు, రెండు చిత్రకారులు. దీని వల్ల సంబంధిత కళారూపాలు వృద్ధి చెందుతాయి. ప్రేక్షకులలో మూడేళ్ల నుండి 80 ఏళ్ల వయస్సు గలవారుంటే ఎనిమిది నుంచి 70 ఏళ్ల మధ్యలో కళాకారులు ఉన్నారు. ఇక్కడ ప్రదర్శనలో పాల్గొన్న ఆర్టిస్ట్ గౌరి, ఒక ఉపాధ్యాయురాలు నుండి కళాకారిణిగా మారింది.
కేవలం మూడు నెలల్లో ఆమె 36గీ36 కాన్వాస్‌పై తన కళను చిత్రించింది. నేను నృత్య రూపంలో మూడు ముఖ కవళికలను చూపించాను. కథాకళికి వేర్వేరు రంగులు, ఆకారాలు, అల్లికలు ఉన్నాయి కాబట్టి నేను ఈ పెయింటింగ్‌ను ఒక నెల కంటే తక్కువ సమయంలోనే సృష్టించాను’ అని వివరించారు.
అమూల్యమైన ఆస్తి
ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశ్యం లక్ష్యం వైపు వేసే మొదటి అడుగు. ‘ప్రజలు కళను పెట్టుబడిగా చూస్తున్నారు. ప్రతి ఇంటì లోనూ ఒక కళాకృతి ఉండటం గుర్తించదగింది. ‘‘ఒక ఇంట్లో ఒక చెట్టు లాగా, ఇంటి ఇంటిలో మా పెయింట్ ఉండాలని కలలు కంటున్నాను. ఇది ఒక భారీ పెట్టుబడి. బంగారం తర్వాత, పెయింటింగ్ అనేది అత్యున్నతమైన పెట్టుబడి మార్కెట్. సాధారణ ప్రజలు ఇంకా దానిని అర్థం చేసుకోలేదు‘ అని సెల్వకన్నన్ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.
పాఠాలు నేర్చుకోవాలి
కళాకారుడు రామలింగం మాటల్లో.. ‘‘ఏదైనా కళారూపంలో, ప్రసిద్ధి చెందిన వారిచే కళను వివరించకుండా, సృష్టించకుండా సృజనాత్మకంగా మారలేరు. సాధారణంగా మనం ‘ఫలానా వారు నా కళను కాపీ చేశారు లేదా దానిని నాశనం చేసారు’ అని నిందిస్తుంటారు. కానీ ఇప్పటికే ఉన్నదానిని చూడకుండా, కాపీ చేయకుండా, సాధన చేయకుండా ఉండటం అసాధ్యం.
మీరు ఒక ప్రత్యేక కళాకారుడిగా ఉండాలనుకుంటే, ఇతర రచనల అందాన్ని నేర్చుకోవాలి. అప్పుడే అభినందించేలా మీ భావాలను ప్రకటిస్తారు.’గ్రేస్‌ఫుల్ స్ట్రోక్స్’ అంతా నేర్చుకోవడం గురించే. సీనియర్ల నుండి అనుభవాన్ని సమతుల్యం చేసుకోవాలి, సృజనాత్మకంగా ఉండాలి, వర్ధమాన కళాకారుల నుండి కొత్తవాటిని అన్వేషించాలి.
అందుకు కొత్త పాఠాలు నేర్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది ‘కళ అందంగా ఉండాలి. విమర్శకులు మాత్రమే అర్థం చేసుకునేలా సంక్లిష్టంగా ఉండి, సామాన్యులు భయపడేలా అసాధారణంగా ఉండనవసరం లేదు‘ అని సెల్వకన్నన్ ఈ సందర్బంగా తెలియజేశారు.
(చదవండి: మన ఇంటి గోడలకు భారతీయ కళాత్మక వారసత్వం..)
Comments
Please login to add a commentAdd a comment