ఆమే నాకు స్ఫూర్తి.. తల్లిపై కమలాహారిస్‌ భావోద్వేగ ట్వీట్‌ | Kamala Harris Interesting Post On Her Mother Shyamala | Sakshi
Sakshi News home page

ఆమే నాకు స్ఫూర్తి.. తల్లి శ్యామలపై కమలాహారిస్‌ భావోద్వేగ ట్వీట్‌

Published Sun, Nov 3 2024 9:32 AM | Last Updated on Sun, Nov 3 2024 10:39 AM

Kamala Harris Interesting Post On Her Mother Shyamala

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో  ఆసక్తికర పోస్టు చేశారు. ఆదివారం(నవంబర్‌ 3) చేసిన ఈ పోస్టులో కమల తన తల్లి శ్యామలా గోపాలన్‌ను గుర్తు చేసుకున్నారు. తన తల్లి ధైర్యం, ధృడ నిశ్చయాలే తనను ఇక్కడిదాకా తీసుకువచ్చాయని, ఆమె స్ఫూర్తితోనే తాను జీవితంలో చాలా సాధించగలిగానని తెలిపారు.

తన తల్లి శ్యామలా గోపాలన్‌ 19 ఏళ్ల వయసులో ఒంటరిగా భారత్‌ నుంచి అమెరికా వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హారిస్‌ చేసిన చాలా ప్రసంగాల్లో తన తల్లి గురించి ప్రస్తావించడం గమనార్హం. 19 ఏళ్ల వయసులో అమెరికా వచ్చిన కమల తల్లి శ్యామలా గోపాలన్‌ రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధనలు చేశారు.

 My mother, Dr. Shyamala Gopalan Harris, came to the United States from India alone at the age of 19. Her courage and determination made me who I am today. pic.twitter.com/nGZtvz2Php

కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీలో చదువుకుంటుండగా జమైకా నుంచి వలస వచ్చిన డొనాల్డ్‌ హారిస్‌తో శ్యామలకు పరిచయమైంది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 1960లో వీరికి కమల జన్మించారు. కమల ఐదో ఏట తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కమల, ఆమె చెల్లి మాయలు తల్లి శ్యామల సంరక్షణలోనే పెరిగారు.

ఇదీ చదవండి: అమెరికాను హారిస్‌ నాశనం చేశారు..నేనొస్తే ఆర్థికంగా అద్భుతాలే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement