
ముంబై: తన తల్లి చికిత్స కోసం ఓ మైనర్ బాలిక తన కన్యత్వాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడింది. కానీ చివర్లో పోలీసుల ఎంట్రీతో ఆమె క్షేమంగా బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలిక తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నందున చికిత్స కోసం డబ్బు అవసరమైంది. అయితే మైనర్ బాలిక తల్లితో నిందితురాలుకు ఇంతకు ముందే పరిచయం ఉండడంతో, బాలికకు డబ్బు అవసరం ఉందనే విషయం తెలుసుకుంది.
ఈ క్రమంలో బాలికతో నిందితురాలు తాము చెప్పినట్లు చేస్తే ఆమె తల్లి చికిత్సకు అవసరమయ్యే మొత్తం సమకూరుతుందని ఆమె నమ్మ పలికింది. తన కన్యత్వాన్ని అమ్మకానికి పెడితే కనీసం రూ.5000 ఇప్పిస్తామని నిందితురాలు తెలపడంతో వేరేదారి లేక ఆ బాలిక అందుకు అంగీకరించింది. కాగా, ఆ నిందితురాలు ఓ వ్యక్తితో రూ. 40 వేలకు బాలికను బేరం పెడుతుంది. ఈ క్రమంలో బాలిక తల్లిని కూడా ఒప్పించి ఆమెను కరోడిలోని ఒక అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లింది. అయితే బేరం కుదుర‍్చుకున్న వ్యక్తి పోలీస్ ఇన్‌ఫార్మర్ కావడంతో నిందితురాలు పన్నిన పన్నాగం బయటపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి సదరు నిందితురాలిని అరెస్ట్ చేయగా, ఆ బాలికను కాపాడారు.
చదవండి: ఇన్‌స్టాలో పరిచయం: బాలిక ‘ప్రేమ చదివింపులు’.. చివరకు..
Comments
Please login to add a commentAdd a comment