సాక్షి,తిరుపతిజిల్లా: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు,చిన్నారులపై దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
ఎంఆర్‌పురంలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని శనివారం(నవంబర్ 2) పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డితో కలిసి రోజా పరామర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది.
నిందితుడు గంజాయి,మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాష్ట్రంలో గంజాయి మత్తులో పెట్రేగి పోతున్నారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. గత ప్రభుత్వం లో తీసుకు వచ్చిన దిశ యాప్‌ను పటిష్టం చేయాలి’అని రోజా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment