
సాక్షి, హైదరాబాద్: బాలిక మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే మధురానగర్ పోలీసులు పరిష్కరించారు. వివరాలివీ... రహమత్‌నగర్‌లో నివాసం ఉండే డి.సంతోషి కుమార్తె బుధవారం ఉదయం స్నేహితురాలు ఇంట్లో పూజ ఉందని చెప్పి వెళ్లింది. గురువారం వరకు కూడా తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గురువారం రాత్రి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ అయినందున పోలీసులు బాలికను కనిపెట్టే విషయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఫోన్ ఆధారంగా యాదాద్రిలో ఉన్నట్టు గుర్తించారు.
శుక్రవారం ఉదయం ఆ బాలిక యాదాద్రిలో తనకు తెలిసిన లక్ష్మీ అనే మహిళతో కలిసి తిరుగుతుండగా ఎస్‌ఐ నరేందర్, సిబ్బంది వెళ్లి పట్టుకున్నారు. బాలికను విచారించగా సీరియల్స్, సినిమాలలో నటించాలని కోరిక ఉందని, అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్‌లో చిన్న క్యారెక్టర్స్‌లో కూడా నటించినట్టు పేర్కొంది. ఈ క్రమంలో లక్ష్మీ అనే మహిళ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పడంతో యాదాద్రికి వచ్చినట్టు పోలీసులకు తెలిపింది. పోలీసులు బాలికను మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment