ప్రతీకాత్మక చిత్రం
గువాహటి: పోలీసులను రక్షక భటులని అంటారు. అయితే కొందరు మాత్రం రక్షించాల్సింది పక్కన పట్టి భక్షిస్తున్నారు. ఓ కేసు విషయమై స్టేషన్‌లోకి తీసుకువచ్చిన బాలికపై కన్నేశాడు ఓ అధికారి. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ దారుణ ఘటన అస్సాంలోని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 21న బాల్య వివాహాల కేసులో మైనర్ బాలికను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తన ప్రియుడితో కలిసి పారిపోయిందని ఫిర్యాదు రావడంతో, పోలీసులు పట్టుకుని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి.. స్టేషన్‌లో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమె అభ్యంతరకరమైన ఫోటోలు తీశాడు. దీంతో ఆ బాలిక.. ‘స్టేషన్‌లో ఆ అధికారి నన్ను బెదిరించాడు, బట్టలు తొలగించమని బెదిరించాడు. ఎస్‌ఐ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బలవంతంగా నా ఫోటోలు తీశాడు. ’ అని ఫిర్యాదు చేసింది. ఈ దారుణమైన ఘటన వెలుగులోకి రావడంతో అస్సాం డీజీపీ ఈ కేసుపై స్పందించారు.
అస్సాం డీజీపీ జీపీ సింగ్ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. అస్సాంలోని నల్బరీ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జూన్ 21న 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు ఇవ్వడానికి రాగా, సబ్ ఇన్‌స్పెక్టర్ బిమన్ రాయ్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపి ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసినట్టు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు రాయ్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. అతని ఆచూకీ గురించి నల్బారి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఎవరైనా సమాచారం అందిస్తే తగిన రివార్డ్ ఉంటుంది" అని రాయ్ ఫోటోతో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. మైనర్‌లను స్టేట్ హోమ్‌లో కాకుండా పోలీస్ స్టేషన్‌లో ఉంచడం పోలీసుల తప్పిదమేనని నల్బరీ జిల్లా ఎస్పీ అంగీకరించారు. "మైనర్‌ల విషయంలో, కొన్ని సూచనలు ఇప్పటికే అమలులో ఉన్నాయి, వాటిని అందరు పోలీసు సిబ్బంది పాటించాలి. మైనర్‌లను పోలీస్ స్టేషన్‌లో ఉంచకూడదు" అని, వారిపై కఠినమైన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం స్టేట్‌హోమ్‌లో ఉంచిన బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారని ఆయన చెప్పారు.
చదవండి: వివాహేతర సంబంధం... ప్రసన్న తలపై రాడ్డుతో విచక్షణారహితంగా 8 సార్లు బాది...
Comments
Please login to add a commentAdd a comment