
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. చత్రినకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పగూడలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతంలో అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో బాగంగా ఉప్పుగూడలో అలి సదరు బాలికను ఇంటికి పిలిచాడు. అనంతరం తన మిత్రుడు ఆర్బాస్‌తో కలిసి అలి బాలికపై లైంగిక దాడి చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు అలి, అర్బాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment