Hyderabad Crime News: Two Minor Girls Molested by Two Young Man- Sakshi
Sakshi News home page

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం

Published Thu, Jun 9 2022 12:51 PM | Last Updated on Fri, Jun 10 2022 9:07 AM

Hyderabad: Two Minor Girls Molested by Two Young Man - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్‌): ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మైనర్‌ బాలికకు వల వేశాడు.. మరొకరు ప్రేమ, పెళ్లి పేరిట మాయమాటలు చెప్పి నమ్మించాడు.. ఇద్దరూ వేర్వేరుగా అక్కాచెల్లెళ్లపై లైంగికదాడికి పాల్పడ్డారు. చివరికి బాలికల ఫిర్యాదుతో కటకటాల పాలయ్యారు. హైదరాబాద్‌లోని చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ సీఐ నరేశ్‌ మీడియాకు వెల్లడించారు.

మెల్లగా వల వేసి..
ఏపీలోని కర్నూల్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వచ్చారు. కొంతకాలంగా బౌద్ధనగర్‌ డివిజన్‌ అంబర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు మైనర్‌ కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తెకు కొద్దినెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అంబర్‌పేట లాల్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ నవాజ్‌ (21) పరిచయమయ్యాడు. చాటింగ్, ఫోన్లు చేస్తూ స్నేహం పెంచుకున్నాడు. కొద్దిరోజులుగా బాలికను లోబర్చుకుని లైంగికదాడికి పాల్పడటం మొదలుపెట్టాడు. ఇక అంబర్‌పేటకే చెందిన మహ్మద్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ (23) కొద్దికాలం క్రితం చిన్న కుమార్తెను పరిచయం చేసుకున్నాడు.

మెల్లగా మాటలు కలిపి.. ప్రేమ, పెళ్లి పేరుతో వల వేశాడు. కొద్ది నెలలుగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. ఇటీవలే బాలికల తల్లితండ్రులకు ఈ విషయం తెలిసింది. తల్లిదండ్రులు ధైర్యం చెప్పడంతో బాలికలు ఈ నెల 8న వేర్వేరుగా చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఐపీసీలోని అత్యాచారం సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇద్దరూ పాత నేరస్తులే..
ఇద్దరు మైనర్లపై లైంగికదాడికి పాల్పడిన నిందితులు పాత నేరస్తులని పోలీసులు తెలిపారు. ఆటో నడిపే మహ్మద్‌ నవాజ్‌పై మలక్‌పేట, అంబర్‌పేట ఠాణాల్లో ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. పీడీ యాక్టు కింద అరెస్టై జైలుకు వెళ్లొచ్చాడని వెల్లడించారు. ఇక వృత్తి రీత్యా ప్లంబర్‌ అయిన మరో నిందితుడు మహ్మద్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌పై చిక్కడపల్లి, బేగంపేట, నల్లకుంట, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట, కాచిగూడ ఠాణాల పరిధిలో 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. అతనూ పీడీయాక్టు కింద జైలుకు వెళ్లొచ్చాడని వివరించారు.

చదవండి: (Amnesia Pub: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసుల సంచలన నిర్ణయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement