uppuguda
-
హైదరాబాద్లో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. చత్రినకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పగూడలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతంలో అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో బాగంగా ఉప్పుగూడలో అలి సదరు బాలికను ఇంటికి పిలిచాడు. అనంతరం తన మిత్రుడు ఆర్బాస్తో కలిసి అలి బాలికపై లైంగిక దాడి చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు అలి, అర్బాస్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
హైదరాబాద్ ఛత్రినాక పేలుడు కేసులో కొత్త కోణం
-
కోరిన కోర్కెలు తీర్చే చిత్రగుప్త ఆలయం
-
యువతి అదృశ్యం
హైదరాబాద్: ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పుగూడ అశోక్నగర్ ప్రాంతానికి చెందిన పి. నర్సింగ్ రావు కూతురు పి. నవనీత (22) స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కాగా ఈ నెల 7న ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అప్పటినుంచి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా లాభం లేకుండా పోయింది.దీంతో కుటుంబ సభ్యులు ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పుగూడ శివసాయినగర్ ప్రాంతానికి చెందిన రాజు (25) అనే యువకునిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ
-
రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ
ఢిల్లీ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు స్వల్ప ప్రమాదానికి గురైంది. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఉప్పుగూడ ప్రాంతంలో రైలు రెండుగా విడిపోయింది. దీంతో ఎస్7 బోగీ దెబ్బతింది. ఒక్కసారిగా అనుకోకుండా ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే రైలు విడిపోవడానికి కారణాలేంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.