హైదరాబాద్: ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పుగూడ అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన పి. నర్సింగ్ రావు కూతురు పి. నవనీత (22) స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కాగా ఈ నెల 7న ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అప్పటినుంచి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా లాభం లేకుండా పోయింది.దీంతో కుటుంబ సభ్యులు ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉప్పుగూడ శివసాయినగర్ ప్రాంతానికి చెందిన రాజు (25) అనే యువకునిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.