
అచ్యుతాపురం(అనకాపల్లి): అచ్యుతాపురం మండలంలోని పూడిమడకలో మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు. పేద కుటుంబానికి చెందిన బాలిక కుటుంబీకులు పెద్దల సహకారంతో న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామానికి చెందిన కొందరు పెద్దలు సదరు బాలికకు, యువకునికి పెళ్లి చేయాలని చర్చలు జరుపుతున్నారు. ఈ విషయమై గ్రామ పెద్దల సూచనల మేరకు అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేయలేదు.