
గత ఆరు నెలల్లో హైదరాబాదీలు 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్‌లను గత 12 నెలల్లో 150 లక్షల బిర్యానీ ఆర్డర్‌లను అందుకున్నారు. బిర్యానీపై తరగని మోజుకు, నగరానికి బిర్యానీకి మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పడుతుంది.
ధమ్ బిర్యానీ చాంపియన్...
గత ఐదున్నర నెలల్లో, 2022 ఇదే కాలంతో పోలిస్తే నగరంలో బిర్యానీ ఆర్డర్‌లలో 8.39% వృద్ధి నమోదైంది. దమ్ బిర్యానీ 9 లక్షలకు పైగా ఆర్డర్‌లతో తిరుగులేని చాంపియన్‌గా నిలిచింది. 7.9 లక్షల ఆర్డర్‌లతో సువాసనగల ఫ్లేవర్డ్ బిర్యానీ తన సత్తా చాట గా, బ్యాచిలర్స్, సింగిల్స్‌కి అలవాటైన మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్‌లను అందుకుంది.
బిర్యానీ ప్రియత్వం ఓ రేంజ్‌లో ఉండటంతో నగరంలో దాదాపు 15,000 పైగా రెస్టారెంట్‌లు తమ మెనూలో బిర్యానీని తప్పనిసరి డిష్‌గా అందజేస్తున్నాయి. బిర్యానీలు అందించే రెస్టారెంట్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కూకట్‌పల్లి, మాదాపూర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్ – దిల్‌సుఖ్‌నగర్ ఉన్నాయి,
కూకట్‌పల్లి టాప్...
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆర్డర్ పరిమాణం పరంగా అత్యధిక బిర్యానీ వినియోగం జరిగింది. వీటిలో. కూకట్‌పల్లి నెంబర్ వన్ కిరీటం అందుకుంటోంది. ఆ తర్వా తి స్థానాల్లో వరుసగా మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి కొండాపూర్ ఉన్నాయి.
నగరవాసులు వేలూ లక్షల బిర్యానీలు హాంఫట్ మనిపిస్తున్నారు. ఏ యేటికాయేడు బిర్యానీ పై తమ ఇష్టాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. ఆదివారం ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గి నిర్వహించిన ఓ అధ్యయనం ఒక్క ఏడాదిలో.. కోటిన్నర బిర్యానీలు నగరం ఆరగించేసిందని తేల్చింది. – సాక్షి, సిటీబ్యూరో
బిర్యానీ ఓ అనుభవం...
నగరంలో బిర్యానీ ప్రియులతో మా ప్రయా ణం చాలా సుదీర్ఘమైనది. నగరవాసులకు బిర్యానీ అనేది కేవలం ఒక తినే వంటకం మాత్రమే కాదు అంతకు మించిన ఒక సంతోషకరమైన అనుభవం. ఈ ప్రపంచ బిర్యానీ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని రూ.199 నుంచే ప్రారంభం అవుతున్న మా బిర్యానీ వైరెటీలను నగరవాసులకు ఆస్వాదించవచ్చు.
– కుశాగ్ర గుప్తా, వైస్‌ప్రెసిడెంట్, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్
Comments
Please login to add a commentAdd a comment