
ఎంసీఈఎంఈని సందర్శించిన ఆర్మీ చీఫ్
కంటోన్మెంట్: టెక్నాలజీ పరంగా భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్మీ సంసిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. బుధవారం ఆయన సికింద్రాబాద్‌లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ)ని సందర్శించారు. ‘ఆత్మ నిర్భర్’లో భాగంగా ఎంసీఈఎంఈ పరిధిలోని ల్యాబరేటరీల్లో రూపొందించిన అధునాత పరికరాలు, చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించారు. డ్రోన్‌లు, అటానమస్ రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఈఎంఈ టెక్నీషియన్స్ సామర్థ్యాన్ని పరిశీలించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈఎంఈలో చోటు చేసుకుంటున్న మార్పుల పట్ల సీఓఏఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.