విషంతో బిర్యానీ వండి భర్తకు పెట్టింది.. | Wife Makes Biryani For Husband In Tamilnadu | Sakshi
Sakshi News home page

విషంతో బిర్యానీ వండి భర్తకు పెట్టింది..

Published Sun, Jul 21 2019 8:21 AM | Last Updated on Sun, Jul 21 2019 8:21 AM

Wife Makes Biryani For Husband In Tamilnadu - Sakshi

తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడని భర్తకు విషం కలిపిన బిర్యానీ పెట్టిన భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. వేలూరు జిల్లా జోలార్‌పేట, ఏలగిరి కొండ అత్తనావూరుకు ప్రాంతానికి చెందిన సెల్వం (38) హోసూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య జయమతి(33). వీరికి ఒక కుమార్తె ఉంది. జయమతి జోలార్‌పేటలో చదువుతున్న సమయంలో ఓ అధ్యాపకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో గత 17వ తేదీ కుమార్తె పుట్టినరోజు నాడు సెల్వం హోసూరు నుంచి ఇంటికి వచ్చాడు. అదే రోజు వివాహేతర సంబంధం గురించి భార్య, భర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో భర్తను కడతేర్చాలని నిర్ణయించుకున్న జయమతి బిర్యానీ వండి అందులో విషం కలిపి భర్తకు ఇచ్చింది. బిర్యానీ తిన్న సెల్వం వాంతులు చేసుకుంటూ సృహ తప్పాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన సెల్వం కుటుంబ సభ్యులు సెల్వాన్ని హుటాహుటిన కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఫిర్యాదు అందుకున్న పోలీసులు పరారిలో వున్న జయమతి కోసం గాలిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement