
తిరువళ్లూరు: ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని హోటల్‌పై పెట్రోల్ బాంబు విసిరిన ఘటన తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో కలకలం రేపింది. అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్ అనే ముగ్గురు వ్యక్తుల స్థానికంగా కస్తూరీ భవన్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హోటల్‌కు వచ్చారు. రౌడీషీటర్ ఎబిన్ పేరు చెప్పి ఉచితంగా బిర్యానీ ఇవ్వాలని బెదిరించారు.
బిర్యానీ అయిపోయిందని నిర్వాహకులు చెప్పడంతో ఆగ్రహించారు. ఎబిన్ అడిగితేనే బిర్యానీ లేదంటారా..? మీ సంగతి తేలుస్తాం అంటూ వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత 4బైక్‌లపై 8మంది వచ్చి హోటల్‌పై పెట్రోల్ బాంబు విసిరారు. దీనిపై హోటల్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.
చదవండి: చికెన్, మటన్ గొడవ..! నిండు ప్రాణం బలి
Comments
Please login to add a commentAdd a comment