వైరల్‌ వీడియో.. ఇట్స్‌ బిర్యానీ టైం బ్రో! | Watch: Long Queue for Biryani Near Bengaluru Goes Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో.. ఇట్స్‌ బిర్యానీ టైం బ్రో!

Published Wed, Sep 30 2020 5:08 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

బెంగళూరు: కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చినప్పుడు చూడాలి జనాలను. షాపులు తెరవక ముందే వెళ్లి క్యూలో నిల్చున్నారు. దాదాపు ప్రతి మద్యం దుకాణం దగ్గర కిలోమీటర్ల మేర వరుసలో నిలబడిన జనాలను చూశాం. ప్రస్తుతం కర్ణాటకలో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. కాకపోతే అది మద్యం దుకాణం ముందు కాదు. ఓ రెస్టారెంట్‌ ముందు. అవును బిర్యానీ కోసం జనాలు ఓ హోటల్‌ ముందు కిలోమీటర్‌ మేర క్యూలో నిల్చున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు చూడండి.. తాజాగా కర్ణాటకలో రెస్టారెంట్లు తెరవడానికి అనుమతించారు. ఈ క్రమంలో బెంగళూరుకు సమీపంలోని హోస్కోట్‌లోని ఆనంద్‌ రెస్టారెంట్‌ దమ్‌ బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement